AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Cases: ఢిల్లీ పాఠశాలల్లో కరోనా విజృంభణ.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం..

Delhi Covid-19 Cases: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. స్కూల్స్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరారు. అవసరమైతే స్కూల్స్

Covid-19 Cases: ఢిల్లీ పాఠశాలల్లో కరోనా విజృంభణ.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం..
Schools
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2022 | 8:32 AM

Share

Delhi Covid-19 Cases: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. స్కూల్స్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరారు. అవసరమైతే స్కూల్స్ ను పాక్షికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఢిల్లీలోని స్కూల్స్‌ (School) లో చాలా మంది పిల్లలకు కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనా (Coronavirus) సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. శనివారం మరో 14 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12 మందిని ఢిల్లీలోని కళావతి సరన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో కరోనాతో చేరిన వారిలో ఎక్కువ మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మార్గదర‍్శకాలను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్ధులకు కరోనా సోకడంపై స్పందించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా. ఢిల్లీ స్కూల్స్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న పాఠశాలలను మూసివేస్తున్నట్టు మనీష్‌ సిసోడియా చెప్పారు. పాఠశాలలను మూసివేయడం చివరి ఎంపికని.. అవసరమైతే పాక్షిక మూసివేత అమలు చేస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.

మరోవైపు ఢిల్లీలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ‍్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెపుతోంది. కాగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలితే సోమవారం నుంచి పిల్లలను పాఠశాలలకు పంపవద్దంటూ పలు ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులకు సూచించాయి.

Also Read:

Corona: పిల్లల్లో కరోనా విజృంభణ.. ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?