Corona: పిల్లల్లో కరోనా విజృంభణ.. ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే

దేశంలో కరోనా(Corona) కారణంగా రెండేళ్లు పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువుకు అవరోధం ఏర్పడకూడదన్న కారణంతో అధికారులు ఆన్లైన్ తరగతులు బోధించారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ వేగవంతం, కరోనా....

Corona: పిల్లల్లో కరోనా విజృంభణ.. ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే
corona
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 17, 2022 | 7:00 AM

దేశంలో కరోనా(Corona) కారణంగా రెండేళ్లు పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువుకు అవరోధం ఏర్పడకూడదన్న కారణంతో అధికారులు ఆన్లైన్ తరగతులు బోధించారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ వేగవంతం, కరోనా కేసుల తగ్గుదల వంటి కారణాలతో పాఠశాలలు పునఃప్రారంభించారు. పాఠశాలలు ప్రారంభించాక ఇటీవలి కాలంలో ఢిల్లీ, నోయిడా వంటి పలు నగరాల్లోని పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే పిల్లల్లో కరోనా వస్తున్నప్పటికీ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయనీ.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అర్హులైన పిల్లలందరూ తక్షణమే వ్యాక్సిన్‌(Vaccine) వేయించుకోవాలని సూచించారు. పిల్లల్లో కరోనా వచ్చినా ఆ ప్రభావం స్వల్పంగానే ఉంటోందనీ, లక్షణాలకు తగిన చికిత్సతోనే కోలుకుంటున్నట్టు గతంలో వచ్చిన కొవిడ్‌ దశల డేటాయే స్పష్టంగా చెబుతోందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా(Delhi AIMS) తెలిపారు. ఇప్పటికీ ఇంకా టీకాలు వేయించుకోని వారు కూడా భయపడాల్సిన అవసరంలేదని వారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.

పాఠశాలలు మూసివేసిన సమయంలో దాదాపు 70 నుంచి 90శాతం మంది పిల్లలు ఇన్ఫెక్షన్‌ బారిన పడినట్టు వేర్వేరు సర్వేల ద్వారా తెలుస్తోందని నిపుణులు చెప్పారు. పెద్దల్లో లాగే చిన్నారుల్లోనూ కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయన్నారు. కొవిడ్‌ వ్యాప్తికి పాఠశాలలు వాహకాలుగా లేనట్టు అంతర్జాతీయంగా వస్తున్న ఆధారాలు సూచిస్తున్నాయని ఐసీఎంఆర్‌ అదనపు డీజీ సమీరన్‌ పాండా అన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడకం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ప్రామాణికమైన ప్రొటోకాల్‌ని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటించాలన్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్‌లు సిఫారసు చేయనప్పటికీ, ఆరు నుంచి 11 ఏళ్ల వయసు వారు మాత్రం వినియోగ సామర్థ్యాన్ని బట్టి మాస్క్‌ ధరించవచ్చని తెలిపారు. 12ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్క్‌లు వినియోగించుకోవాలని సూచించారు. పిల్లలంతా కలిసి ఒకేచోట కలిసి భోజనం చేయకుండా చూడటంతో పాటు క్యాంటీన్లు/డైనింగ్‌ హాళ్లలో ఎక్కువసేపు సేపు ఉండకూడదని తెలిపారు.

Also Read

చాణక్య నీతి: ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలంటే ఈ 5 విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Glowing Skin Tips: అందమైన ముఖ వర్చస్సు కోసం ‘కలబంద’ను ఇలా ఉపయోగించండి..!

Clashes At Delhi: ఘర్షణలపై భగ్గుమన్న విపక్షాలు.. ప్రధాని మౌనం వల్లే ఈ దురాగతాలు అంటూ ఫైర్..!