AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing Skin Tips: అందమైన ముఖ వర్చస్సు కోసం ‘కలబంద’ను ఇలా ఉపయోగించండి..!

Glowing Skin Tips: కలబంద దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. మచ్చలు, మొటిమలు, నిస్తేజంగా,

Glowing Skin Tips: అందమైన ముఖ వర్చస్సు కోసం ‘కలబంద’ను ఇలా ఉపయోగించండి..!
Aloe Vera
Shiva Prajapati
|

Updated on: Apr 17, 2022 | 6:25 AM

Share

Glowing Skin Tips: కలబంద దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. మచ్చలు, మొటిమలు, నిస్తేజంగా, నిర్జీవమైన చర్మానికి పునరుజ్జీవం పోస్తుంది. ఇది చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చర్మంపై మంట, దురద నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మంలో కొల్లాజెన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కలబందను.. అందమైన ముఖ వర్చస్సు కోసం అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మరి అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలోవెరా జెల్.. అలోవెరా జెల్‌ను ముఖం, మెడపై రాయాలి. చర్మాన్ని మసాజ్ చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు దీన్ని ఉపయోగించాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. దీనిని ప్రతిరోజూ చేస్తే మీ ముఖం నిగనిగలాడుతుంది.

మెరిసే చర్మం కోసం.. అలోవెరా జెల్, రోజ్ వాటర్ సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. చర్మాన్ని కాసేపు మసాజ్ చేయాలి. దీన్ని చర్మంపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత తడి టవల్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని రోజుకు రెండుసార్లు చేయొచ్చు.

కలబంద, తేనె.. ఒక చెంచా అలోవెరా జెల్ తీసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా పట్టించాలి. ఆ తరువాత చర్మాన్ని మసాజ్ చేయాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు.

అలోవెరా, నిమ్మరసం.. ఒక చెంచా అలోవెరా జెల్‌‌లో కొంత నిమ్మరసం కలపండి. బాగా మిక్స్ చేసి.. ఫేస్‌కు, మెడపై అప్లై చేయాలి. కాసేపు చర్మాన్ని మసాజ్చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 2 నుండి 3 సార్లు చేస్తే అందమైన ముఖం మీసొంతం అవుతుంది.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!