AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వార ఫలాలు.. ఏప్రిల్‌ 17 నుంచి 23 వరకు ఈ రాశుల వారికి అనుకూలం..

Weekly Horoscope: చాలా మంది ఉదయం నిద్ర లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది..

Weekly Horoscope: వార ఫలాలు.. ఏప్రిల్‌ 17 నుంచి 23 వరకు ఈ రాశుల వారికి అనుకూలం..
Weekly Horoscope
Subhash Goud
|

Updated on: Apr 17, 2022 | 7:49 AM

Share

Weekly Horoscope: చాలా మంది ఉదయం నిద్ర లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. అయితే ఈ వారంలో దాదాపు అన్ని రాశుల వారికి మంచి జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 17 నుంచి 23వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: ఈ రాశివారికి ఈ వారంలో మంచి జరుగుతుంది. అవసరానికి సహాయం చేసేవారుంటారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది. ఆదాయం కలిసి వస్తుంది.
  2. వృషభ రాశి: వృత్తి, వ్యాపార రంగాలకు వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శుభ కార్యల్లో పాల్గొంటారు. చేపట్టి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో రాణిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికి సమర్థవంతంగా రాణిస్తారు. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  3. మిథున రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఓ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. రాజకీయ రంగాల వారికి మంచి జరుగుతుంది.
  4. కర్కాటక రాశి: ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహకారం అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.
  5. సింహరాశి: చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ ధైర్యంతో ముందుకెళ్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
  6. కన్య రాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా ధన వ్యయం కలిగే అవకాశాలున్నాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలుంటాయి. ఉద్యోగాల కోసం విదేశాలలకి వెళ్లే అవకాశం ఉంటుంది. కొందరి స్నేహితుల కారణంగా కొంత డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది.
  7. తులరాశి: కొన్ని సందర్భాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే అవకాశాలుంటాయి.. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. పెళ్లి ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలుంటాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం మంచిది.
  8. వృశ్చిక రాశి: చేపట్టే పనులలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అపర్థం చేసుకునే అవకాశం ఉంది.
  9. ధనుస్సు రాశి: మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మాట గౌరవించడం వల్ల మంచి జరుగుతుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వృత్తి, వ్యాపారస్తులకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.
  10. మకర రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగు పడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి.
  11. కుంభ రాశి: ఓ శుభవార్త మిమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. కీలక వ్యవహారాలలో పెద్దల సహకారం తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. విద్యార్థులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. అధికారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
  12. మీన రాశి: చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం కుదుట పడుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

TV9 Impact: సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ఫీజు సగానికి తగ్గింపు..

Shani Dev: ఉద్యోగం రావడం లేదా? ఏ ప్రయత్నమూ సక్సెస్ అవడం లేదా? అయితే శనివారం రోజు ఇలా చేయండి..!