TV9 Impact: సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ఫీజు సగానికి తగ్గింపు..

Saleshwaram Lingamayya Swamy Temple: తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లాలోని సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు భారీ ఊరట లభించింది. వాహనాలకు భారీగా వసూలు చేస్తున్న టోల్ ఫీజులపై

TV9 Impact: సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ఫీజు సగానికి తగ్గింపు..
Saleshwaram
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 17, 2022 | 6:52 AM

Saleshwaram Lingamayya Swamy Temple: తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లాలోని సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు భారీ ఊరట లభించింది. వాహనాలకు భారీగా వసూలు చేస్తున్న టోల్ ఫీజులపై టీవీ9 వరుస కథనాలకు అటవీశాఖ (Forest Department) అధికారులు దిగొచ్చారు. టోల్‌ ఫీజులను సగానికి సగం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కారు, లారీ, డీసీఎంలకు వెయ్యి రూపాయలుగా ఉన్న టోల్‌ ఫీజును సగానికి తగ్గించి 500కు పరిమితం చేశారు. అటు ద్విచక్రవాహనాలకు వంద రూపాయల నుంచి 50 రూపాయలకు కుదించారు. ఈనెల 15న ప్రారంభమైన సలేశ్వరం ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. సలేశ్వరానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువైపోయాయి. దీంతో ట్రాఫిక్​ జాం సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు టోల్​ ఫీజును భారీగా పెంచేశారు. టోల్‌ ఫీజును భారీగా పెంచడంతో భక్తుల ఇక్కట్లపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.

భక్తుల నుంచి భారీ వసూళ్లకు దిగిన అటవీశాఖ అధికారులు టీవీ9 కథనాలకు దిగొచ్చి.. టోల్‌ బాదుడును సగానికి తగ్గించారు. టోల్‌ ఫీజులు భారీగా తగ్గించేందుకు కృషి చేసిన టీవీ9ను భక్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు నల్లమలలో వర్షాలు దంచికొడుతుండడంతో దారంతా బురదమయం అయింది. దీంతో అధికారులు సలేశ్వరం రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయినా భక్తులు సలేశ్వరానికి తరలిపోతూనే ఉన్నారు.

Also Read:

Minister KTR: తెలంగాణ ఐటీ హబ్‌పై కేంద్రం తీవ్ర వివక్ష.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే