Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..

Bharti Singh: ది కపిల్‌ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్‌. ఇందులో ఆమె లల్లి పాత్రలో కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది.

Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..
Bharti Singh
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2022 | 9:48 AM

Bharti Singh: ది కపిల్‌ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్‌. ఇందులో ఆమె లల్లి పాత్రలో కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేవిధంగా కామెడీ సర్కస్‌, ఝలక్‌దిక్లాజా, బిగ్‌బాస్‌, నచ్‌బలియే, ఖత్రోన్‌ కే ఖిలాడీ, డ్యాన్స్‌ దీవానే తదితర రియాలిటీ షోలతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో పాటు కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కాగా భారతి సింగ్ (Bharti Singh) హార్ష్‌ లింబచియాను 2017 డిసెంబర్‌లో గోవాలో వివాహం చేసుకుంది. తమ ఐదేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఈనెల 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ కామెడీ క్వీన్‌. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ మురిసిపోయారు ఈ లవ్లీ కపుల్. బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు అంతా వీరికి శుభాకాంక్షలు తెలియచేశారు.

అయితే అమ్మగా ప్రమోషన్‌ పొందిన 12 రోజులకే ఆమె షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆమె అభిమానులు సూపర్‌ వుమెన్‌ అని భారతీసింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పని విషయంలో ఆమె నిబద్ధతను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు. ఈ సమయంలో పురిటిబిడ్డను చూసుకోవాల్సింది పోయి డబ్బుల కోసం అప్పుడే షూటింగ్ సెట్స్‌కు వెళ్తున్నావా? అని తిట్టిపోస్తున్నారు. కనీసం నెల రోజులు కూడా బిడ్డతో ఉండలేకపోయావా ? అని మండిపడుతున్నారు. జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ముందుగా కుదుర్చుకున్న కమిట్‌ మెంట్స్‌ వల్ల వెంటనే షూటింగ్‌కు రావాల్సి వచ్చిందని.. పసిబిడ్డతో గడపలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు భారతీ చెప్పుకొచ్చింది.

Also Read: JP Nadda: బీజేపీ ఉన్నచోట మిషన్‌.. కాంగ్రెస్‌ ఉన్నచోట కమిషన్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా

R Madhavan: పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. స్విమ్మింగ్‌లో సిల్వర్ గెలుచుకున్న కొడుకు.. శుభాకాంక్షలు వెల్లువ

Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో