KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్

బాక్సాఫీస్‌ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కలెక్షన్ల సునామీని ఇప్పట్లో ఆపేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌.. కొత్త రికార్డులు సెట్ చేస్తూ వెళ్తున్నాడు.

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్
Kgf 2 Collection
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2022 | 12:05 PM

KGF Chapter 2 Box Office Collection Day 4 :యశ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. కాసులతో పెద్ద ఖజానా నిర్మించుకుంటున్నాడు. లిటరల్‌గా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు రాకీ భాయ్.  అడ్డూ అదుపు లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. దేశవిదేశాల నుంచి సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నా.. ఎలివేషన్స్ ముందు అవన్నీ తేలిపోతున్నాయి. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌(prashanth neel) తెరకెక్కించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ఏప్రిల్‌ 14న రిలీజైంది. అప్పట్నుంచి బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతుంది.  కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి, కొత్త చరిత్రను లిఖించింది చాప్టర్ 2. ఆదివారం నాలుగో రోజు సాధించిన రూ. 132.13 కోట్ల‌తో క‌లుపుకొని,  వరల్డ్‌వైడ్‌ నాలుగు రోజుల్లో ‘కేజీఎఫ్ చాప్ట‌ర్ 2’ వ‌సూళ్ల గ్రాస్ రూ. 551.83 కోట్ల‌కు చేరుకుంది. ఫస్ట్ డే గురువారం రూ. 165.37 కోట్లు, శుక్ర‌వారం రూ. 139.25 కోట్లు, శ‌నివారం రూ. 115.08 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది. మూవీ హిందీ వెర్షన్ దుమ్మురేపుతోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

Also Read: Andhra: ఏపీలో అన్ని చోట్లా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం రూ.10 తగ్గాయి.. ట్విస్ట్ ఏంటంటే..?