Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..

న్యాచురల్ స్టార్ నాని (Nani).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న సినిమా అంటే సుందరానికి(Ante Sundaraniki).

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2022 | 2:47 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న సినిమా అంటే సుందరానికి(Ante Sundaraniki). ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పంచెకట్టు సాంగ్ మరింత ఆసక్తిని పెంచాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మొదటి పాట పంచెకట్టు సూపర్‌హిట్ కాగా, పోస్టర్లు, హోమం వీడియో స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ డేట్ ని ప్రకటించడంతో పాటు మరో రెండు బ్రాండ్ న్యూ పోస్టర్‌లను విడుదల చేశారు మేకర్స్.

ఈ పోస్టర్స్ లో హీరో, హీరోయిన్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి నటిస్తుండగా, నజ్రియా, లీలా థామస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో క్లాస్‌ అండ్ స్టైలిష్‌గా,మరో పోస్టర్ లో సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇవి కాకుండా.. నాని.. దసరా సినిమా చేస్తున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్.

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్

Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..

Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!