Amway: ఆమ్‌వే ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ.. మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ..

ఆమ్‌వే(Amway) ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 757.77 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం తెలిపింది...

Amway: ఆమ్‌వే ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ.. మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ..
Amway1
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 18, 2022 | 6:09 PM

ఆమ్‌వే(Amway) ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 757.77 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తులలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆమ్‌వే భూమి, ఫ్యాక్టరీ భవనం, ప్లాంట్ ఉన్నాయి. యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. రూ.411.83 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అలాగే ఆమ్‌వేకి చెందిన 36 వేర్వేరు ఖాతాల్లోని రూ.345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఆమ్వే డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ నెట్‌వర్క్ ముసుగులో మోసానికి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని ఏజెన్సీ తెలిపింది.

2002-03 నుంచి 2021-22 వరకు వ్యాపార కార్యకలాపాల నుంచి ఆమ్‌వే రూ. 27,562 కోట్లు ఆర్జించిందని ఈడీ పేర్కొంది. ఈ కంపెనీ 2002-03 నుంచి 2020 వరకు భారత్ USAలోని దాని పంపిణీదారులు, సభ్యులకు రూ. 7,588 కోట్ల కమీషన్ చెల్లించినట్లు గుర్తించామని వివరించింది. “అసలు వాస్తవాలు తెలియకుండానే, సామాన్య ప్రజలు కంపెనీలో సభ్యులుగా చేరి, అధిక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా కంపెనీ ప్రేరేపించిందని తెలిపింది. కంపెనీలో సభ్యులుగా చేరి కోట్లు సంపాదించ్చొచని ప్రచారం చేసి చాలా మంది మోసం చేసినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. ఆమ్‌వే 1996-97లో భారతదేశంలో రూ. 21.39 కోట్లను షేర్ క్యాపిటల్‌గా తీసుకువచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు, కంపెనీ తమ పెట్టుబడిదారులు, మాతృ సంస్థలకు డివిడెండ్, రాయల్టీ, ఇతర చెల్లింపుల పేరుతో రూ. 2,859.10 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది. డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ-లెవల్ మార్కెటింగ్ నెట్‌వర్క్ ముసుగులో ఆమ్‌వే పిరమిడ్ మోసాన్ని కొనసాగిస్తోందని ED తన విచారణలో గుర్తించింది.

Read Also.. EPFO: కనీస పింఛన్‌ వచ్చేది ఎప్పుడో.. ఈపీఎఫ్‌వో నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది..