Ramzan 2022: ఆలయంలో ఇఫ్తార్ చేసుకునేందుకు ముస్లింలకు ఆహ్వానం.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ గ్రామ హిందువులు

Religious Harmony: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల మత ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Ramzan 2022: ఆలయంలో ఇఫ్తార్ చేసుకునేందుకు ముస్లింలకు ఆహ్వానం.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ గ్రామ హిందువులు
Iftar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2022 | 2:19 PM

Religious Harmony: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల మత ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఓ గ్రామంలోని హిందువులు.. పురాతన దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఆహ్వానించారు.. ఈ ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని దల్వానా గ్రామంలో జరిగింది. దల్వానాలోని 1,200 ఏళ్ల నాటి వరండా వీర్ మహారాజ్ మందిర్‌లో (Varanda Vir Maharaj Mandir).. ఏప్రిల్ 9న ముస్లింలు ఉపవాసం విరమించేందుకు (ఇఫ్తార్).. మగ్రిబ్ నమాజ్ చేసుకోవడానికి ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని.. అందరూ కలిసి మెలసి (hindu muslim relations) ఇలానే ఉంటామని ఈ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా గ్రామంలోని 100 మంది ముస్లిం నివాసితులను చారిత్రక ఆలయంలో నమాజ్ చేసుకునేందుకు ఆహ్వానించి.. ఏర్పాట్లు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. దీనిపై ఆలయ పూజారి 55 ఏళ్ల పంకజ్ థాకర్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ కలిసి మెలసి.. సోదరభావంతో ఉంటారని పేర్కొన్నారు. హిందూ.. ముస్లిం పండుగల సమయాల్లో మతాలకతీతంగా గ్రామస్థులు ఒకరినొకరు సాయం చేసుకుంటారని వెల్లడించారు.

దీంతో.. ఆలయ ట్రస్ట్, గ్రామ పంచాయతీ సంయుక్తంగా పట్టణంలోని ముస్లిం నివాసితులను ఈ సంవత్సరం ఆలయానికి ఆహ్వానించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ తెలిపారు. తమ గ్రామంలో ఉపవాసం ఉండే 100 మంది ముస్లింలకు ఐదు నుంచి ఆరు రకాల పండ్లు, ఖర్జూరాలు, షర్బత్‌లను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక మసీదులోని మౌలానా సాహిబ్‌ను కూడా వ్యక్తిగతంగా స్వాగతించినట్లు థాకర్‌ పేర్కొన్నారు. గ్రామంలోని 35 ఏళ్ల వసీం ఖాన్ మాట్లాడుతూ.. గ్రామంలో చాలా కాలంగా ప్రబలంగా ఉన్న మత సామరస్యం గురించి వివరించారు. దాల్వానాలోని ముస్లిం సమాజం.. ఏ పండుగైనా “హిందూ సోదరులతో” కలిసి జరుపుకుంటామని తెలిపారు. దేవాలయంలో ఉపవాసం ఉండే ముస్లింలను ఆహ్వానించాలని గ్రామసభ చేసిన ప్రతిపాదన దీనికి నిదర్శనమని తెలిపారు.

శ్రీరామనవమి రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఘటన జరిగింది. కాగా.. దల్వానా కిందకు వచ్చే తాలూకా వడ్గాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మాట్లాడుతూ.. వరండా వీర్ మహారాజ్ దేవాలయంలో జరిగిన ఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని.. భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుందంటూ పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో ఈ గ్రామంలో మత సామరస్యానికి సంబంధించిన కథనాలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కాగా.. కేరళలోని మలప్పురం జిల్లాలోని వనియన్నూర్‌లోని చతంగడు శ్రీ మహా విష్ణు ఆలయంలో ఈ నెల ప్రారంభంలో ఇదే విధమైన మతసామరస్యం వెల్లివిరిసింది. ఆలయం వార్షిక స్థాపన దినోత్సవ వేడుకల్లో భాగంగా సామూహిక ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 200 మంది ముస్లింలు హాజరయ్యారు.

Also Read:

Viral Video: నేనెప్పుడూ చూడలే..! ఈ కోడి గుడ్డుతోనే ఫుట్‌బాల్ ఆడేస్తోంది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Viral Video: ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. కానీ చివరకు ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో