Royal Bengal Tiger: బోట్‌లో తరలిస్తుండగా నీటిలో దూకిన పులి.. వైరల్‌గా మారిన వీడియో..

సోషల్ మీడియా(Social Media)లో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందంటే....

Royal Bengal Tiger: బోట్‌లో తరలిస్తుండగా నీటిలో దూకిన పులి.. వైరల్‌గా మారిన వీడియో..
Tiger
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Apr 20, 2022 | 2:07 PM

సోషల్ మీడియా(Social Media)లో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. రాయల్ బెంగాల్ టైగర్‌(Tiger)ను సుందర్‌బన్స్‌కు అడవిలో వదిలిపెట్టేందుకు తీసుకువెళుతుండగా పులి బోట్‌(Boat)పై నుంచి నీటిలోకి దూకింది. నీళ్లలో దూకిన బెంగాల్‌ టైగర్‌ ఈదుతూ ఎంజాయ్ చేసింది. ఈ బోట్‌లో ఉన్న వారు పులి నీటిలో దూకడం, ఈదడాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) పర్వీన్ కల్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ” టైగర్ సైజ్ జంప్. టైటిల్‌ కూడా పెట్టారు. ఈ వీడియో 88,000 వ్యూస్‌ వచ్చాయి. 4,000లకు పైగా లైక్స్‌ వచ్చాయి. అయితే నీటిలో దూకిన టైగర్‌ను పట్టుకుని సుందర్‌బన్స్‌కు అడవిలో వదిలి పెట్టారు.

ఫిబ్రవరిలో హిమాలయన్ బ్లాక్ ఎలుగుబంటిని రక్షించిన వీడియోను కొద్ది రోజుల క్రితం పర్వీన్ కల్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. హిమాలయ నల్ల ఎలుగుబంటి చిక్కుకుపోయింది. మా బృందాలు ఉదయం నుంచి ఆపరేషన్ చేసి ఎటువంటి గాయాలు లేకుండా ఎలుగు బంటిని రక్షించామని ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also.. Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..