Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiritual: హిందూ సంప్రదాయం ప్రకారం పూజ తర్వాత ధూపం వేస్తారు.. ఎందుకో తెలుసా..?

Spiritual News: హిందూ మతంలో దేవుడికి పూజ చేసిన తర్వాత ధూపం వేయడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అగర్‌బత్తుల

Spiritual: హిందూ సంప్రదాయం ప్రకారం పూజ తర్వాత ధూపం వేస్తారు.. ఎందుకో తెలుసా..?
Fumigation
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 6:00 PM

Spiritual News: హిందూ మతంలో దేవుడికి పూజ చేసిన తర్వాత ధూపం వేయడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అగర్‌బత్తుల సుగంధం లేకుండా సంపూర్ణమైన పూజలు ఏవీ జరగవు. దీంతో పాటు ధూపం వేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. హిందూ గ్రంధాలలో ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వేర్వేరు వస్తువుల దూపం వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ధూపం వేయడం ద్వారా వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క హిందూ మతంలోనే కాకుండా చాలా మతాలలో ధూపం వేస్తారు. కానీ పద్దతులు మాత్రం వేరుగా ఉంటాయి.

కర్పూరం లవంగం ధూపం

ఇంట్లో రోజూ పూజ చేసిన తర్వాత కర్పూరం, లవంగం ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. వాటిపై ఉండే క్రిములు నాశనం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రతికూల శక్తులు ఏవి ఇంట్లోకి ప్రవేశించలేవు.

గుగ్గిలం ధూపం

గుగ్గిలం చాలా సుగంధ పదార్ధం. దీని ధూపం గృహ వివాదాలను శాంతింపజేస్తుంది. మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారికి దీని వాసన ఉపశమనం కలిగిస్తుంది. గుగ్గిలం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా గుగ్గిలం వాడుతారు.

దశాంగ్ ధూపం

గుగ్గిలం, గంధం, జటామంసి, సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, కస్తూరి వంటి పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి దశాంగ్ ధూపం వేస్తారు. దీని వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొని రోగాలు నశిస్తాయని నమ్మకం.

వేప ఆకుల ధూపం

వేప బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. వేప ఆకుల ద్వారా తయారు చేసిన ధూపం వేయడం ద్వారా ఇంట్లో దాగి ఉన్న అన్ని రకాల క్రిములు చనిపోతాయి. హానికరమైన దోమలు, కీటకాలు నశిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో రోగాలు దూరమవుతాయని నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Ayurvedic: ఒత్తిడి, ఆందోళన తగ్గించే ఆయుర్వేద మూలికలు.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు..

ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు.. దీని రక్షణ కోసం సెక్యూరిటీ.. ఎందుకంత క్రేజ్‌ అంటే..?

కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పరీక్ష చేయించుకోండి..