సహస్రాబ్ది వేడుకలకు రండి.. తమిళనాడు గవర్నర్ R.N.రవిని ఆహ్వానించిన త్రిదండి చిన్నజీయర్ స్వామి..
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు.
Sri Ramanujacharya Temple: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల ముగింపు రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరుకానున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులు ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
అటు ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహస్రాబ్ది ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో… ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా 15 రోజులే సమయముంది.
ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..