Sleep Direction Vastu: ఈ దిశ వైపు తల పెట్టి పడుకోవడం మీకు అత్యంత శుభదాయకం.. ఎందుకో తెలుసుకోండి..

వాస్తు నియమాలు అనేవి ఇల్లు , కార్యాలయానికి మాత్రమే కాకుండా.. వ్యక్తికి సంబంధించిన అనేక కార్యకలాపాలకు కూడా రూపొందించబడ్డాయి. ఈ నియమాలను విస్మరించడం వ్యక్తి శారీరక, మానసిక స్థితిపై..

Sleep Direction Vastu: ఈ దిశ వైపు తల పెట్టి పడుకోవడం మీకు అత్యంత శుభదాయకం.. ఎందుకో తెలుసుకోండి..
Best To Sleep
Follow us

|

Updated on: Jan 18, 2022 | 11:40 AM

Sleep Direction Vastu: వాస్తు నియమాలు అనేవి ఇల్లు , కార్యాలయానికి మాత్రమే కాకుండా.. వ్యక్తికి సంబంధించిన అనేక కార్యకలాపాలకు కూడా రూపొందించబడ్డాయి. ఈ నియమాలను విస్మరించడం వ్యక్తి శారీరక, మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మాత్రమే కాదు, అతను ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందిదీని వల్ల బాధిత వ్యక్తి తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటాడని, లేదంటే డబ్బు కొరతతో బాధపడుతుంటాడని చెబుతున్నారు. మీరు ఏ దిక్కున నిద్రించడానికి శ్రేయస్కరం అనే దాని గురించి మేము మాట్లాడుతున్నాము. సరైన దిశలో నిద్రించడం వల్ల వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. మంచి నిద్ర కూడా పొందుతారు.

మీరు సరైన దిశలో నిద్రపోకపోతే, మీ జీవితంలో సమస్యలు, చికాకులు వస్తాయని వస్తు శాస్త్రం వెల్లడించింది. రాత్రి లేదా పగలు నిద్రిస్తున్నప్పుడు ఏ దిశలో ఉండాలి..? ఎటు వైపుగా తల పెట్టాలి..? ఎటువైపుగ తల పెడితే ప్రయోజనాల గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం..

దక్షిణం వైపు పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ దిశలో తల పెట్టి నిద్రించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దక్షిణం వైపు పాదాలను పెట్టి నిద్రపోకూడదు.. అది అశుభం. మన పాదాలను దక్షిణం వైపు పెట్టి పడుకోవడం వల్ల మనలో రక్త హీనత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం అంటోంది.

తూర్పు దిశ కూడా ఉత్తమమైనది

మీరు దక్షిణం వైపు తల పెట్టి నిద్రించలేకపోతే, తూర్పు వైపు తల పెట్టి నిద్రించడానికి ప్రయత్నించండి. దక్షిణం తర్వాత తూర్పు వైపుకు వెళ్లడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇతర దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయని చెబుతారు. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు నుండి దక్షిణం వైపు కాకపోయినా.. ఖచ్చితంగా తూర్పు వైపు తల పెట్టి నిద్రించండి.

తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి

ఇంట్లో ఒంటరిగా సంపాదించే వారు తూర్పున తలపెట్టి పడుకోవడం మంచిదని విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారట.. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వరకు అధిగమించవచ్చని అంటున్నారు వాస్తు పండితులు. చదువుకునే వారు కూడా తూర్పు దిక్కున తల పెట్టి నిద్రించాలి. తూర్పు వైపు తల పెట్టి పడుకోవడం వల్ల విద్యార్థి చదువుల పట్ల మొగ్గు చూపడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

గుడి వైపుగా..

చాలా మంది తమ పాదాలను ఆలయం వైపు పెట్టి పడుకుంటారు. ఇలా చేయడం సరికాదు. ఇది చాలా అశుభం.. ఆలయం వైపు మీ పాదాలతో నిద్రపోకుండా ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..