AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ప్రశాంతత కరువైందా.? ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి..

వాస్తు నియమాలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టరు. వాస్తు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్ పరిస్థితులపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తులో లోపాలు ఉంటే ఇంట్లో ఉండే వారికి మానసిక ప్రశాంతత దూరమవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఎలాంటి వాస్తు లోపాలు ఉంటే ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

Vastu Tips: ఇంట్లో ప్రశాంతత కరువైందా.? ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Sep 24, 2023 | 1:58 PM

Share

భారతీయుల జీవనశైలిలో వాస్తు ఒక భాగం. వాస్తును ఎంతగానో విశ్వసించే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాస్తు నియమాలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టరు. వాస్తు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్ పరిస్థితులపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తులో లోపాలు ఉంటే ఇంట్లో ఉండే వారికి మానసిక ప్రశాంతత దూరమవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఎలాంటి వాస్తు లోపాలు ఉంటే ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

* ఇంట్లో ఒక తలుపునకు మరో తలుపు ఎట్టి పరిస్థితుల్లో ఎదురుగా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఉంటే ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

* ఇంట్లో తలుపులు నైరుతి దిశలో ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతంత దెబ్బ తింటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇంటికి బయట కానీ, లోపల కానీ తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలి. ఇలా చెత్త పేరుకుపోతే ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది.

* ఇంట్లో ఆగ్నేయ దిశ ఎట్టి పరిస్థితులతో అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉండకూడదు. ఒకవేళ ఇలా ఉంటే ఇంట్లో వారందరూ అనారోగ్యంతో బాధపడుతుంటారు.

* ఇంట్లో తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. బీరువాలు, ఫ్రిడ్జ్‌లు వంటి వాటిని తూర్పు దిశలో ఉంచకూడదు.

* ఇంట్లో నిత్యం సంతోషంగా ఉండాలంటే ఈశాన్య దిశ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. కుటుంబంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే స్విస్తిక్‌ లేదా ఓం చిహ్నాలను ఏర్పాటు చేసుకోవాలి.

* ఇంట్లో ఉత్తరం నుంచి దక్షిణం వరకు విభజించేలా గోడను ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలా నిర్మిస్తే జీవితంలో కష్టాలు ఎదురవుతాయి.

* ఇంటి మెయిన్‌ గేట్ ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దిశలో ఉండకూడదు. ముఖ్యంగా ఆ దిశలో గేటు ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు.

* ఇంట్లోకి తూర్పు దిశ నుంచి గాలి, వెలుతురు నిత్యం వచ్చేలా చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన పేర్కొన్నవిషయాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. దీనిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గుర్తించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం క్లిక్ చేయండి..