Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు.. మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.!

కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి లాభం ఉండట్లేదా.? అవసరాలకు సరిపడా డబ్బు అందట్లేదా.? ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి...

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు.. మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.!
Vastu Tips
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 12, 2021 | 10:09 AM

కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి లాభం ఉండట్లేదా.? అవసరాలకు సరిపడా డబ్బు అందట్లేదా.? ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే తప్పనిసరిగా మీ ఇంటి వాస్తును ఒక్కసారి చూపించాల్సిందే. వాస్తులో ఏవైనా దోషాలు ఉంటే.. అది ఖచ్చితంగా మీపై ప్రభావం పడుతుంది. ఏదొక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంటిలోని వస్తువులు సరైన చోట లేకపోవడమే వాస్తు దోషానికి ప్రధాన కారణం. కొన్ని వాస్తు నియమాలు.. మన జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.!

* వాస్తుశాస్త్రం ప్రకారం, స్వస్తిక్, త్రిశూలం, క్రాస్ మొదలైన శుభ చిహ్నాలను ఇంటి వెలుపల ఉంచితే, దుష్ట శక్తులు ఇంటి లోపలికి ప్రవేశించవు. ఇంట్లో ఎలప్పుడూ ఆనందం ఉంటుంది.

* ఇంటి గదులన్నీ వెంటిలేట్ చేసి ఉండాలి. అంతేకాకుండా దాని లోపల కుండలు, మొక్కలను ఎప్పుడూ పెట్టొద్దు. రాత్రిపూట వాటి నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

* హింసాత్మక లేదా విచారకరమైన జంతువుల చిత్రాలను, పెయింటింగ్‌లు లేదా శిల్పాలు ఉంచవద్దు – పక్షులు, ఏడుస్తున్న పిల్లలు, సూర్యాస్తమయం లేదా నీట మునిగిన ఓడ లాంటి చిత్రాలను మీ ఇంటి గదుల్లో ఉంచొద్దు. అలాంటి చిత్రాలు జీవితంలో నిరాశను, ఒత్తిడిని తీసుకొస్తాయి.

* బోన్సాయ్ మొక్కలను ఎప్పుడూ గదిలో ఉంచకూడదు. అవి చూడటానికి అందంగా కనిపించినప్పటికీ.. మీ జీవితంలో అభివృద్ధికి అడ్డంకిగా మారతాయి.

* గడియారం, టీవీ, టేప్, రికార్డర్, రేడియో మొదలైనవి ఇంట్లో ఏ మూలానా ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీ జీవిత పురోగతిలో అడ్డంకులను సృష్టిస్తాయి.

* మంచం కింద ఏవైనా కొన్ని వస్తువులను ఉంచేందుకు చోటు ఉంటే.. అక్కడ పరుపు లేదా బట్టలను మాత్రమే పెట్టండి. మంచం క్రింద పరిశుభ్రత లేకపోతే అనేక వాస్తు దోషాలు తలెత్తుతాయి. ప్రతిరోజూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలపై వివాదాలు చెలరేగుతాయి.

* వాస్తుశాస్త్రం ప్రకారం, నీటిలో ఉప్పు వేసి, ఇంటిని తుడిచినా, శుభ్రపరిచినా నెగటివ్ ఎనర్జీలు నశించి.. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురించబడింది)

Also Read:

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..