Snake in Temple: దుర్గమ్మ గుడిలో పాము ప్రత్యక్షం.. పూజ పూర్తయ్యే వరకు అమ్మవారినే చూస్తూ..
Snake in Temple: కృష్ణా జిల్లా కోడూరులోని కనక దుర్గమ్మ ఆలయంలో నాగు పాము కలకలం సృష్టించింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
Snake in Temple: కృష్ణా జిల్లా కోడూరులోని కనక దుర్గమ్మ ఆలయంలో నాగు పాము కలకలం సృష్టించింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఆలయంలో పాము ప్రత్యక్షమయ్యింది. పామును చూసి భక్తులు పరుగులు తీశారు. పాము మాత్రం ఏ మాత్రం భయపడకుండా నేరుగా గుడిలోకి వెళ్లింది. గుడిలో ఓ మూలకు చేరి పడగ విప్పి అమ్మవారిని చూస్తూ అలాగే ఉండిపోయింది. ఎంతసేపటికీ పాము వెళ్లకపోవడంతో.. అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు.
పూజ సాగినంత సేపు.. పాము ఆలయంలోనే ఉంది. పూజలను తదేకంగా చూస్తూ ఉండిపోయింది. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం నాగు పాము గుడిలో నుంచి వెళ్లిపోయింది. అయితే, పామును చూసి తొలుత భయపడిన జనాలు.. ఆ తరువాత ధైర్యం తెచ్చుకున్నారు. అమ్మవారిని పూజించడం కోసమే పాము వచ్చినట్లు భావించారు. పాము వెళ్లిపోగానే.. ప్రజలు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Also read: