Pamban Bridge: కొత్త పంబన్ బ్రిడ్జి.. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి.. ఆకట్టుకుంటున్న వీడియో..
భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌కి తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మాణం జరుగుతోంది . దీని పేరు ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’. ఈ బ్రిడ్జ్‌ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌కి తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మాణం జరుగుతోంది . దీని పేరు ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’. ఈ బ్రిడ్జ్‌ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణపనుల ఫొటోలను ట్విటర్ వేదికగా మంత్రి షేర్ చేశారు.
మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణపనులు 2019 నవంబరు 9న ప్రారంభమైయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సుమారు 250కోట్లు వెచ్చింది. ఈ బ్రిడ్జ్‌కి 104ఏళ్ల చరిత్ర ఉంది. బంగాళా ఖాతంలోని పంబన్ దీవికి, మన దేశానికి అనుసంధానంగా ఉంటుంది.63మీట్లరు పొడవైన ఈ బ్రిడ్జి.. పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్ చేసేవిధంగా ఏర్పాటు చేశారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే.. రామేశ్వరానికి రైళ్లను అధికవేగంతో నడిపేందుకు.. అలాగే అధిక బరువు ఉన్నలోడ్‌ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. కాగా పాత పంబన్ బ్రిడ్జిని 1914లో అందుబాటులోకి తీసుకురాగా… ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Groom Viral Video: పెళ్లిలో స్నేహితుల హంగామా..ఇదేం తమాషారా బాబు మండిపోదా.! నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో
Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో…