AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Theory: ఇలాంటి కలలు కనిపిస్తున్నాయా.. రానున్న కాలంలో అదృష్టానికి సూచనట..

కొన్ని రకాల కలలు భవిష్యత్ కు సంకేతాలని స్వప్న శాస్త్రం పేర్కొంది.  హిందూ గ్రంధాలలో కలల ప్రాముఖ్యత కూడా అపారమైనది. ఎందుకంటే వ్యక్తి  భవిష్యత్తు ఈ కలతో ముడిపడి  ఉంటాయని.. నిద్రలో కలలు కనే వివిధ స్థాయిలు ఉన్నాయని స్వప్న శాస్త్రాలు పేర్కొన్నాయి.  స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా శుభప్రదమైనవి. ఆర్థిక లాభం, విజయం, ఆనందం , శ్రేయస్సు పొందే అవకాశం ఉందని ముందస్తు సూచన. కొన్నిసార్లు కలలు జీవిత చక్రాన్ని మార్చగలవు. ఏ కలలు అదృష్టాన్ని సూచిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.. 

Dream Theory: ఇలాంటి కలలు కనిపిస్తున్నాయా.. రానున్న కాలంలో అదృష్టానికి సూచనట..
Dream Theory
Surya Kala
|

Updated on: Jul 05, 2024 | 12:40 PM

Share

నిద్రపోతున్న ప్రతి ఒక్కరూ కలలు కంటారు.  ఒక్కోసారి మధురమైన కలలు అయితే మరికొన్ని సార్లు భయంకరమైన కలలు వస్తాయి. కలలు రకరకాలుగా ఉంటాయి. జంతువులూ, పక్షులు, రకరకాల సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల కలలు కనిపిస్తాయి. మరి ఈ కలలు కొన్నిసార్లు శుభకరమైనవి. కొన్నిసార్లు అశుభకరమైనవిగా నిరూపిస్తాయి. కొన్ని రకాల కలలు భవిష్యత్ కు సంకేతాలని స్వప్న శాస్త్రం పేర్కొంది.  హిందూ గ్రంధాలలో కలల ప్రాముఖ్యత కూడా అపారమైనది. ఎందుకంటే వ్యక్తి  భవిష్యత్తు ఈ కలతో ముడిపడి  ఉంటాయని.. నిద్రలో కలలు కనే వివిధ స్థాయిలు ఉన్నాయని స్వప్న శాస్త్రాలు పేర్కొన్నాయి.  స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా శుభప్రదమైనవి. ఆర్థిక లాభం, విజయం, ఆనందం , శ్రేయస్సు పొందే అవకాశం ఉందని ముందస్తు సూచన. కొన్నిసార్లు కలలు జీవిత చక్రాన్ని మార్చగలవు. ఏ కలలు అదృష్టాన్ని సూచిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..

  1. పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. మరణం అంటే భయపడతారు కూడా.. అయితే కలలో మృత్యువు చూడటం శుభ ఫలితాలనిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం అటువంటి కల సమీప భవిష్యత్తులో లాభాలను సూచిస్తుంది. తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  2. కలలో చనిపోయిన వ్యక్తిని చూడటం వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుంది. జీవించి ఉన్న వ్యక్తి కలలో చనిపోయినట్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు.
  3. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి  కలలో చనిపోయినట్లు కనిపిస్తే..అతని ఆరోగ్యంలో బాగుపడి మళ్ళీ ఆరోగ్యంగా జీవిస్తాడని నమ్మకం.
  4. మరణించిన పూర్వీకులు వచ్చి కలలో ఆశీస్సులు ఇస్తే జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టాలు తిరిగి వస్తాయి. ఇలాంటి కల వ్యక్తి భవిష్యత్తులో గొప్ప అవకాశాలను కూడా తెస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మీరు కలలో బావి నుండి నీటిని తోడుతున్నట్లు కనిపిస్తే ఈ కల మీకు సంపద , శ్రేయస్సును తెస్తుంది.  ఆదాయాన్ని కూడా పెరుగుతుందని విశ్వాసం.
  7. కలల శాస్త్రం ప్రకారం కలలో పచ్చని చెట్లు, తోటలను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.
  8. చెట్టు నుండి పండ్లు కోసినట్లు కనిపిస్తే అది మరింత మంచిది. ఈ కల వల్ల  మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు