పచ్చి బొప్పాయి: లివర్ ఆరోగ్యానికి పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్లు, ఎంజైములు, ఫైబర్ ఉంటాయి. పచ్చి బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయం నుంచి విషపదార్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది ప్రోటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్లో పచ్చి బొప్పాయి ఆహారాన్ని తినడం వల్ల కాలేయ పనితీరు చురుకుగా ఉంటుంది.