Vitamin D Deficiency: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. విటమిన్ డీ లోపం ఏమో చెక్ చేసుకోండి..
విటమిన్ డి సహజంగా మనకు లభ్యం అవుతుంది. సూర్యుని కిరణాల నుండి మన శరీరం ఈ విటమిన్లను పొందుతుంది. ఇక విటమిన్ డీ ఉన్న ఆహారం గురించి మాట్లాడితే ట్యూనా ఫిష్, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులలో అధిక మొత్తంలో మొత్తంలో ఉంటుంది. అయితే నేటి యుగంలో ఎక్కువ మంది సూర్యరశ్మికి దూరంగా జీవిస్తున్నారు. అంతేకాదు సమతుల్య ఆహారం తీసుకోకపోయినా శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా విటమిన్ డి లోపం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ విటమిన్ లోపం ఉంటే రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు ఎముకల బలహీనతలకు కారణం అవుతుంది. విటమిన్ డి.. శరీరంలో బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు ఎవరి శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉంటుందో.. వారు జలుబు, దగ్గు , ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. విటమిన్ డి కండరాల బలాన్ని పెంచుతుంది.
ఈ విటమిన్ డి సహజంగా మనకు లభ్యం అవుతుంది. సూర్యుని కిరణాల నుండి మన శరీరం ఈ విటమిన్లను పొందుతుంది. ఇక విటమిన్ డీ ఉన్న ఆహారం గురించి మాట్లాడితే ట్యూనా ఫిష్, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులలో అధిక మొత్తంలో మొత్తంలో ఉంటుంది. అయితే నేటి యుగంలో ఎక్కువ మంది సూర్యరశ్మికి దూరంగా జీవిస్తున్నారు. అంతేకాదు సమతుల్య ఆహారం తీసుకోకపోయినా శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయినప్పటికీ ఎక్కువ మంది ఈ విషయాన్నీ గుర్తించరు. అటువంటి పరిస్థితిలో విటమిన్ డి లోపం లక్షణాలు, ఎలా గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం..
విటమిన్ డి లోపం లక్షణాలు ఏమిటి
విటమిన్ డి లోపం వల్ల శరీరం తరచుగా అలసటకి గురవుతుందని ఢిల్లీలోని జిటిబి హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ చెప్పారు. శక్తి తగ్గిపోతుంది. ఎముకలు, కండరాలలో నొప్పి మొదలవుతుంది. రోజు రోజుకీ ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. విటమిన్ డి లోపం మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువగా విచారంగా, నిరాశ వంటి సమస్యలను కలిగిస్తుంది.
విటమిన్ డి కూడా న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. మెదడులోని భావోద్వేగాలను నియంత్రించేందుకు ఈ న్యూరోట్రాన్స్‌మిటర్‌లు పనిచేస్తాయి. విటమిన్ డి తగినంతగా లేనప్పుడు ఈ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరు ప్రభావితమవుతుంది. ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువసేపు విచారంగా ఉండేలా చేస్తుంది. దీంతో డిప్రెషన్, తలనొప్పి వస్తుంది.
విటమిన్ డి లోపం రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే
- ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా గడపండి
- చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులను తినండి
- పాలు, పాల ఉత్పత్తులను తీసుకోండి
- ఒకవేళ వైద్యుడు సూచిస్తే.. ఆ విధంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి
- విటమిన్ డికి సంబందించిన పరీక్ష చేయించుకోండి.. తద్వారా దీని లోపాన్ని సరైన సమయంలో గుర్తించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..