అక్కా ఎలా వస్తాయి మీకు ఈ ఐడియాలు.. మటన్ కీమాతో కేక్ తయారీ.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్
కోవిడ్ సమయంలో లాక్ డౌన్ నుంచి ఈ ఆహార పదార్ధాల మీద ప్రయోగాలు మొదలు పెట్టారని చెప్పవచ్చు. కొన్ని రకాల ప్రయోగాలతో రుచికరమైన వంటకం మరింత రుచికరంగా మారితే మరికొందరు వివిధ ఆహార పదార్థాలతో వింత ప్రయోగాలు చేసి అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపించేలా చేస్తున్నారు. కొన్ని రకాల ఆహారాన్ని చూసి వారంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఓ తరహా ప్రయోగం జనాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని వీడియోలు ఆహారానికి సంబంధించినవి. రకరకాల ఆహార ప్రయోగాలు చేస్తూ వివిధ కాంబినేషన్‌లతో ఆహారాన్ని తయారు చేసే వీడియోలు రోజు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ ప్రజల మధ్య చర్చలో ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్ డౌన్ నుంచి ఈ ఆహార పదార్ధాల మీద ప్రయోగాలు మొదలు పెట్టారని చెప్పవచ్చు. కొన్ని రకాల ప్రయోగాలతో రుచికరమైన వంటకం మరింత రుచికరంగా మారితే మరికొందరు వివిధ ఆహార పదార్థాలతో వింత ప్రయోగాలు చేసి అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపించేలా చేస్తున్నారు. కొన్ని రకాల ఆహారాన్ని చూసి వారంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఓ తరహా ప్రయోగం జనాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఎవరి పుట్టినరోజు అయినా, వార్షికోత్సవం అయినా లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమం అయినా, ప్రతి ఫంక్షన్‌లో కేక్‌కు ముఖ్యమైన స్థానం ఉంది. అటువంటి పరిస్థితిలో కేక్ ను ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా చేయడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని రకాల ప్రయోగాలతో కేక్ మరింత అందంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోనే చర్చనీయాంశం అవుతోంది. ఇది చూసిన తర్వాత నన్ను నమ్మండి.. ఎవరైనా సరే ఖచ్చితంగా వికారం అనుభూతి చెందుతారు. పూర్తిగా ఆలోచనలో పడిపోతారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
ఓ మహిళ అద్భుతంగా కేక్‌ను తయారు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మహిళ చేసిన కేక్‌ల కాంబినేషన్‌ను చూసి కేక్ ప్రియులు షాక్ తిన్నారు. మహిళ మటన్ మాంసంతో కేక్ తయారు చేసింది. ఇందుకోసం ముందుగా కుక్కర్‌లో మటన్ కీమా వేసి వండింది. కేక్ ఆకృతిగా మలచడానికి ఆమె బ్రెడ్‌ను అనేక పొరలుగా కట్ చేసి.. ఆపై మటన్ మాంసపు పొరను అప్లై చేసింది. తర్వాత దాని మీద క్రీమ్‌ను అప్లై చేసి మాంసం కేక్ ను సిద్ధం చేసింది.
ఈ వీడియోను vidhus.kitchen అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకే ఈ వీడియోను వేల మంది చూసి రకరకాల కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ మహిళ నరకం తలుపులు తెరుస్తుందని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో ఇలాంటి కలయికలను ఎప్పుడూ ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..