AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Agents In Pani Puri : పానీ పూరీ ప్రియులకు చెడువార్త.. ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు.. !అధికారుల తనిఖీల్లో బట్టబయలు..

తమిళనాడులోనూ ఇలాంటి హానీకారక పానీపూరీలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందిందని, ఇక్కడ కూడా నాణ్యతపై ఎప్పటికప్పుడు విస్తృత తనిఖీలు  జరగాలన్నారు. పానీపూరీలో వాడే నీళ్లలో పచ్చి పొడి కలుపుతున్నారని, దీని వల్ల ఏమైనా ఇబ్బందులుంటే విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. అటూ చెన్నైలోనూ పానీపూరీ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Cancer Agents In Pani Puri : పానీ పూరీ ప్రియులకు చెడువార్త.. ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు.. !అధికారుల తనిఖీల్లో బట్టబయలు..
Pani Puri
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2024 | 7:54 AM

Share

గత 10 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చాట్ వంటకాలలో పానీ పూరీ ఒకటి. ఉత్తర భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ చాట్ ఫుడ్, ఇప్పుడు మెల్లిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. తమిళనాడులో అత్యధికంగా అమ్ముడవుతున్న స్నాక్స్‌గా మారింది. చెన్నైలోనే కాదు తమిళనాడు గ్రామాల్లోనూ పానీ పూరీ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. వీధి వ్యాపారుల దుకాణాలు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో విక్రయించే పానీపూరీని తింటే ప్రాణాంతక వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని రోటరువా దుకాణాల్లో విక్రయించే పానీ పూరీల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం పానీపూరీలు విక్రయించే అన్ని దుకాణాలు, హోటళ్లలో పానీపూరీలను సేకరించిన ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పానీపూరీలో క్యాన్సర్‌కు కారణమయ్యే సింథటిక్ పిగ్మెంట్లు ఉన్నట్లు కనుగొనబడింది. పానీపూరీలో చాలా రకాలు ఉన్నాయి. కర్ణాటకలో రకరకాల రుచుల్లో పానీపూరీ అమ్ముడవుతాయి. అందులో ముఖ్యంగా గోబీ మంచూరియన్, కబాబ్ రకాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే కృత్రిమ కలర్స్‌ వాడుతున్నట్టుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ కెమికల్‌ కలర్స్‌ బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో వంటివి ఎక్కువగా వాడుతున్నట్టుగా ఫుడ్‌సెప్టీ అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయి.

తమిళనాడులోనూ ఇలాంటి హానీకారక పానీపూరీలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందిందని, ఇక్కడ కూడా నాణ్యతపై ఎప్పటికప్పుడు విస్తృత తనిఖీలు  జరగాలన్నారు. పానీపూరీలో వాడే నీళ్లలో పచ్చి పొడి కలుపుతున్నారని, దీని వల్ల ఏమైనా ఇబ్బందులుంటే విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

అటూ చెన్నైలోనూ పానీపూరీ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెరీనా బీచ్‌లోని పానీ పూరీ షాపులపై చెన్నై జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు దాడులు నిర్వహించారు.

పానీపూరీ ప్రియులు, సామాన్యులను కూడా ఆకర్షించేందుకు పానీపూరీ దుకాణదారులు ఇలా కృత్రిమ రంగులు, ఫ్లేవర్లను వాడుతున్నట్లు సమాచారం. కృత్రిమ ఆహారాన్ని, ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించే రంగులను కలపకుండా సహజసిద్ధంగా రంగులు తయారు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫుడ్‌ కలర్స్‌ కోసం బీట్‌రూట్‌, పసుపు, కుంకుమ పువ్వు వంటివి వాడాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..