AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలూతో అందం..! ఇలా వాడితే నల్లటి ఒత్తైన జుట్టు, పట్టులాంటి చర్మం మీ సొంతం..!

ఆలు సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. జుట్టు నుండి చర్మం వరకు, బంగాళాదుంపలకు మీ అందాన్ని పెంచే శక్తి ఉంది. బంగాళదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ సమస్యను దూరం చేస్తుంది. చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఆలూతో అందం..! ఇలా వాడితే నల్లటి ఒత్తైన జుట్టు, పట్టులాంటి చర్మం మీ సొంతం..!
Benefits Of Potatoes
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2024 | 11:57 AM

Share

బంగాళదుంప.. ఈ కూరగాయను తరచుగా పరోటా, చిప్స్, కూరలు, ఫ్రెంచ్ ఫ్రైలలో ఉపయోగిస్తారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే, రెగ్యులర్ వినియోగం చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. జుట్టు నుండి చర్మం వరకు, బంగాళాదుంపలకు మీ అందాన్ని పెంచే శక్తి ఉంది. బంగాళదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ సమస్యను దూరం చేస్తుంది. చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కంటికి ప్రయోజనం ఎలా ప్రయోజనం?:

సరిగ్గా నిద్రపోకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు రావడం మామూలే. దీన్ని అరికట్టేందుకు చాలా మంది మార్కెట్‌లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ బంగాళదుంపలు మీకు అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలవు. అవును, బంగాళాదుంప ముక్కలు కళ్ల కింద నల్లటి వలయాలు,ఉబ్బినట్లు ఉండటాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీని కోసం మీరు చేయాల్సిందల్లా. రెండు సన్నని బంగాళాదుంప ముక్కలను కట్ చేసి, వాటిని కళ్లపై 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. మరింత బెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం వాటిని ఉపయోగించే ముందు కాసేపు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే త్వరలోనే మార్పును గమనిస్తారు.

జుట్టుకు బంగాళదుంప ట్రీట్‌మెంట్:

ప్రస్తుతం యువతలో తెల్లజుట్టు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పౌష్టికాహారం లేకపోవడం, మారుతున్న జీవనశైలి వల్ల జుట్టు నెరసిపోతుంది. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చే పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. మీరు తీసిపారేసే బంగాళాదుంప తొక్క అనేక జుట్టు ప్రయోజనాలను కలిగి ఉంది. బంగాళదుంప తొక్క తీసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ప్రకాశం కూడా పెరుగుతుంది. బంగాళాదుంప తొక్కలను నీటిలో ఉడకబెట్టి, నీటిని వడకట్టండి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

మొటిమలు, మచ్చలు మాయం చేస్తుంది:

బంగాళదుంప రసంలో చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి. నల్లటి వలయాలను తగ్గించడమే కాకుండా, మొటిమలు, మచ్చలను తొలగించడంలో కూడా బంగాళాదుంప రసం ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు బంగాళాదుంప నుండి రసాన్ని తీయాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ రెండు నెలల పాటు చేస్తే మొటిమలు, మచ్చలు పోతాయి.

సన్ బర్న్ నుండి రక్షణ:

బంగాళదుంపలలో ఉండే ఎంజైమ్‌లు, విటమిన్లు సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం లోపలి నుండి పోషణను అందిస్తుంది. వాపు, నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం మీరు ఒక బంగాళాదుంపను గుండ్రంగా కట్ చేసి మంట ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే వాపు కూడా తగ్గుతుంది.

జుట్టు రాలడం నియంత్రణ:

బంగాళాదుంప చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. బంగాళదుంపలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బంగాళదుంప నుండి రసాన్ని తీసి జుట్టు మూలాలతో సహా తలకు బాగా పట్టించాలి. 30 నుండి 60 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై షాంపూతో వాష్‌ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..