Hair Growth Tips: పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ నూనెలు బెస్ట్..

అందమైన ఒత్తైన జుట్టు ఉండాలని మహిళలు అందరూ అనుకుంటారు. జుట్టు బలంగా, దృఢంగా ఉండి పెరగాలంటే అందుకు తగినట్టుగా మీరు ఏం చేస్తున్నారన్నది కూడా ముఖ్యమే. ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. 70 శాతం ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. అయితే ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మార్కెట్లో ఉండే క్రీములు, లోషన్లు, ఆయిల్స్, షాంపూలు వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉండదు.  డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టే బదులు..

Hair Growth Tips: పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ నూనెలు బెస్ట్..
Hair Growth Tips
Follow us

|

Updated on: Jul 03, 2024 | 12:06 PM

అందమైన ఒత్తైన జుట్టు ఉండాలని మహిళలు అందరూ అనుకుంటారు. జుట్టు బలంగా, దృఢంగా ఉండి పెరగాలంటే అందుకు తగినట్టుగా మీరు ఏం చేస్తున్నారన్నది కూడా ముఖ్యమే. ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. 70 శాతం ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. అయితే ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మార్కెట్లో ఉండే క్రీములు, లోషన్లు, ఆయిల్స్, షాంపూలు వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉండదు.  డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టే బదులు.. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే కేర్ తీసుకుంటే సరిపోతుంది. జుట్టుకు ఆయిల్స్ ఎంచుకునే విషయంలో చాలా మంది తప్పులు చేస్తారు. కానీ మంచి ఆయిల్ తలకు రాస్తే.. బలమైన, ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే ఫలితం కాస్త లేటు అయినా.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నూనె:

జుట్టు పెరిగేందుకు, బలంగా, దృఢంగా ఉండేందుకు కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో మంచి పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మా, జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెలో మాయిశ్చ రైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నూనె తలకు రాసుకుంటే జుట్టు సాఫ్ట్‌గా ఉంటుంది. డబుల్ బాయిలింగ్ పద్దతిలో కొబ్బరి ఆయిల్ వేడి చేసి తలకు రాసి మర్దనా చేయాలి. దీని వల్ల తలపై రక్త ప్రసరణ బాగా పెరిగి.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.

ఆలివ్ ఆయిల్:

జుట్టుకు రక్షణ ఇవ్వడంలో ఆలివ్ ఆయిల్ కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. పొడి జుట్టు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే.. జుట్టుకు మంచి కండీషనర్‌గా పని చేస్తుంది. అంతేకాకుండా జుట్టును మృదువుగా, బలంగా చేస్తుంది. మంచి సువాసన అందిస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బాదం ఆయిల్:

జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో బాదం ఆయిల్ కూడా చాలా మంచిగా సహాయ పడుతుంది. బాదాం ఆయిల్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ ఆయిల్‌తో తలకు మర్దనా చేసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మనసు రిలాక్స్ అవుతుంది. అంతే కాకుండా జుట్టును సాఫ్ట్‌గా, బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. వీటిల్లో మీకు బాగా పడిన ఆయిల్ వాడటం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు