Indian Railway Video : పర్వతాలు, జలపాతాలు దాటుతూ కొండ గుహాల్లో దూరిన రైలు..! ఈ అద్బుత దృశ్యం ఎక్కడంటే..
ఇక్కడ గంభీరమైన పర్వతాల అద్భుతమైన దృశ్యాలు, ప్రకృతి అందాలను చూడవచ్చు. ఈ వీడియోను భారతీయ రైల్వే జూలై 2న షేర్ చేసింది. ఈ వీడియోని వేలాది చూశారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని త్వరలో చూస్తామని కొందరు చెబుతుండగా, మరికొందరు ఇంత అందమైన దృశ్యం ఎక్కడ ఉంది ..? ఏ రూటలో వెళితే.. ఇలాంటి అద్భుతాలను చూడగలం అని అడుగుతున్నారు.
భారతీయ రైల్వేలు కొండలు, మైదానాలు, అడవులతో సహా అనేక ప్రమాదకరమైన, భయానకమైన, అందమైన ప్రాంతాల గుండా వెళుతుంది. అనేక ప్రదేశాలలో అద్భుతమైన దృశ్యాలు చూడవచ్చు. వర్షాకాలంలో పర్వతాలలోని జలపాతాలు, పచ్చదనాన్ని చూసి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది. వీడియో చూసిన తర్వాత రైలు స్వర్గం గుండా వెళుతున్నట్లు అనిపిస్తుంది. వైరల్ వీడియోలో రైలు కొన్ని ప్రదేశాలలో జలపాతం కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాలలో రైలు ఎత్తైన వంతెన గుండా వెళుతుంది. కొన్ని ప్రదేశాలలో రైలు పర్వత సొరంగంలోకి వెళుతుంది. మొత్తంమీద ఇండియన్ రైల్వే ఓ అద్భుతమైన వీడియోను షేర్ చేసింది.
వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, భారతీయ రైల్వేలతో అందమైన ప్రయాణం సాగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక్కడ గంభీరమైన పర్వతాల అద్భుతమైన దృశ్యాలు, ప్రకృతి అందాలను చూడవచ్చు. ఈ వీడియోను భారతీయ రైల్వే జూలై 2న షేర్ చేసింది. ఈ వీడియోని వేలాది చూశారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని త్వరలో చూస్తామని కొందరు చెబుతుండగా, మరికొందరు ఇంత అందమైన దృశ్యం ఎక్కడ ఉంది ..? ఏ రూటలో వెళితే.. ఇలాంటి అద్భుతాలను చూడగలం అని అడుగుతున్నారు.
Embark on beautiful journeys with Indian Railways, where majestic mountains meet the azure sky in a marvellous display of nature’s beauty. ✨ pic.twitter.com/nymz2PQb02
— Ministry of Railways (@RailMinIndia) July 2, 2024
మరికొందరు ఇండియన్ రైల్వే సేవలను ఎద్దేవా చేస్తున్నారు. చాలా రైళ్ల రూఫ్‌లలో లీకేజీలు ఉన్నాయని, అక్కడ జలపాతాలు కనిపిస్తాయని యూజర్ ఒకరు కామెంట్ చేశారు. ఈ విషయంలో భారతీయ రైల్వేలకు ధన్యవాదాలు, మనం జలపాతాలను చూడటానికి చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఫన్నీగా రాశారు. భారతీయ రైల్వేలో ప్రయాణిస్తూ.. ఇంత అందమైన దృశ్యాలు చూడగలిగితే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ఇంకొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..