Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు.. క్షణం ఆలస్యం అయ్యుంటే ..

ట్రాక్‌ మధ్యలోకి రాగానే, వారి స్కూటీ ముందు టైర్‌ పట్టాలపై ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావటం లేదు. బండిని బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెనుక కూర్చున్న అమ్మాయి దిగి స్కూటర్‌ని నెట్టడం ప్రారంభించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రైలు వేగంగా దూసుకొచ్చింది. క్షణాల్లో ఆమె స్కూటర్..

Watch: యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు.. క్షణం ఆలస్యం అయ్యుంటే ..
scooter crossing railway track
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2024 | 12:29 PM

రైలు పట్టాలు దాటుతున్నప్పుడు అజాగ్రత్త ప్రాణాంతకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్‌ దాటవద్దని ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మరీ సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినప్పటికీ వీటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవటం లేదు. ప్రతి సారి ప్రజల తొందరపాటు కారణంగా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఒక చిన్నారి, మరో అమ్మాయితో కలిసి రైల్వే ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స్కూటీపై వెళుతూ రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైరల్‌గా మారిన వీడియోలో కనిపిస్తోంది. ట్రాక్‌ మధ్యలోకి రాగానే, వారి స్కూటీ ముందు టైర్‌ పట్టాలపై ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావటం లేదు. బండిని బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెనుక కూర్చున్న అమ్మాయి దిగి స్కూటర్‌ని నెట్టడం ప్రారంభించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రైలు వేగంగా దూసుకొచ్చింది. క్షణాల్లో ఆమె స్కూటర్ దిగి చిన్నారిని కిందకు దించి రైల్వే ట్రాక్‌ పక్కన నిలబెట్టింది.. రైలు రావడం చూసి అమ్మాయిలిద్దరూ భయపడ్డారు. ట్రాక్‌పై ఇరుక్కుపోయిన స్కూటర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అంతలోనే రైలు వచ్చి స్కూటర్‌ని ఢీకొట్టేసింది.

ఇవి కూడా చదవండి

అదృష్టవశాత్తూ ఆ స్కూటీ లేడీతో సహా ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకొంచెం అజాగ్రత్తగా ఉన్నా, ఇంకో క్షణం ఆలస్యం అయినా ముగ్గురూ ప్రాణాలు కోల్పోయే వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..