AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అమ్మాయి అన్సర్ రాక్.. నెటిజన్స్ షాక్.. నేటి యువత రీల్స్ స్టార్స్ మాత్రమే అంటూ కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రెహాన్ ఖాన్ తరచుగా వ్యక్తులతో చిన్న చిన్న ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. సాధారణ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. అయితే తాజాగా ఆయన అడిగిన ఓ ప్రశ్నకు యువతి చెప్పిన సమాధానం విన్న శ్రోతలు సైతం తలలు పట్టుకునేలా సచేసింది. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు అమ్మాయిలను చూపించారు. ఇందులో భారత జాతీయ గీతాన్ని ఎవరు రాశారు అని రెహాన్ అడుగుతున్నట్లు కనిపించింది.

జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అమ్మాయి అన్సర్ రాక్.. నెటిజన్స్ షాక్.. నేటి యువత రీల్స్ స్టార్స్ మాత్రమే అంటూ కామెంట్స్
National Song Of India
Surya Kala
|

Updated on: Jul 03, 2024 | 11:08 AM

Share

నేటి తరం ఆలోచనలు అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి అంటూ తరచుగా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా కొంతమంది యువతీయువకులకు దేశం, దేశ స్వాతంత్ర్యం, నాయకులు వంటి ప్రముఖుల గురించి కనీస జ్ఞానం లేకపోతుంది. దీంతో కొన్ని సార్లు ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కనీస జ్ఞానం లేకపోతే కొన్నిసార్లు హాస్యాస్పదమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఇంటర్నెట్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భారతదేశ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు అంటూ కొంతమందిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఓ అమ్మాయి నుంచి వచ్చిన సమాధానం విని ఇంటర్నెట్ వినియోగదారులు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. అంతేకాదు అసలు ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా ఉంటున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రెహాన్ ఖాన్ తరచుగా వ్యక్తులతో చిన్న చిన్న ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. సాధారణ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. అయితే తాజాగా ఆయన అడిగిన ఓ ప్రశ్నకు యువతి చెప్పిన సమాధానం విన్న శ్రోతలు సైతం తలలు పట్టుకునేలా సచేసింది. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు అమ్మాయిలను చూపించారు. ఇందులో భారత జాతీయ గీతాన్ని ఎవరు రాశారు అని రెహాన్ అడుగుతున్నట్లు కనిపించింది. కొందరు రవీంద్రనాథ్ ఠాగూర్ అని, మరికొందరు బెంగాల్ కు చెందిన వ్యక్తి పేరు గుర్తులేదు అన్నారు. ఇదిలా ఉంటే ఒక అమ్మాయి గాయకుడు అరిజిత్ సింగ్ పేరుని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మాయి సమాధానం చెప్పిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రజలు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by REHAN KHAN (@voxhub.rehan)

జాతీయ గీతం ‘వందేమాతరం’ని బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఇది ఆయన తన బెంగాలీ నవల ‘ఆనందమత్’లో సంస్కృతంలో వ్రాసిన పద్యం. కాలక్రమంలో ఈ పద్యం జాతీయ గీతంగా మారింది. 1896లో కోల్‌కతాలో రహమతుల్లా ఎం సయానీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సెషన్‌లో వందేమాతర గీతం మొదటిసారిగా ఆలపించారు. అయితే ఆ అమ్మాయి సమాధానం విని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.. నేటి యువ తరం ఎటు పోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకరు వ్యాఖ్యానించారు.. ఇది రీల్‌బాజ్ తరం.. వీరికి ‘లహ్రా దో…లహ్రా దో’ జాతీయ గీతం అని ఫన్నిగా కామెంట్ చేస్తూనే తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరికొందరు అయితే హే…ప్రజలకు జాతీయ గీతం గురించి కూడా తెలియదు.. మనం ఎక్కడికి వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. మరొకరు చమత్కరిస్తూ బ్రదర్ మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగారని వ్యాఖ్యానించారు. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ప్రజలు వినోదాన్ని పొందుతారు .. అయితే మన దేశం గురించి ముఖ్యమైన సమాచారాన్ని నేటి యువతకు అందించాలని మనకు బోధిస్తుందని చెప్పారు

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..