భక్తురాలి శాపంతో రాయిగా మారిన విష్ణువు.. శాప విముక్తి కలిగిన ప్రదేశంలో నేడు ఆలయం.. ఎక్కడ ఉందంటే
విష్ణువు ఈ దేవతలకు జలంధరుడి నుంచి కాపాడతానని హామీ ఇచ్చాడు. దీంతో తన లీలలను ప్రదర్శిస్తూ విష్ణువు బృంద భర్త జలంధరుడి రూపంలో బృందా ముందు కనిపించాడు. బృందా విష్ణువు చర్యలను అర్థం చేసుకోలేకపోయింది. అతనిని తన భర్తగా భావించి అతని పాదాలను తాకింది. అలా బృందా విష్ణువు పాదాలను తాకగానే.. దేవతలు జలంధరుడిని యుద్ధంలో వధించారు. ఈ విషయం తెలుసుకున్న బృంద నువ్వు ఎవరు అని అడిగింది. అప్పుడు విష్ణువు తన నిజరూపాన్ని ధరించాడు.
త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు లోక రక్షకుడుగా భావిస్తారు. మహా విష్ణువు వివిధ అవతారాలు ధరించి ప్రపంచాన్ని, శరణు అన్న భక్తులను రక్షించాడు. అయితే విష్ణువు కూడా శాపం నుంచి తనని తాను రక్షించుకోలేకపోయాడు. విష్ణువు బృందా దేవి చేత శపించబడ్డాడు. ఆ శాపం నుంచి విష్ణువును బృందా దేవి విముక్తం చేసిన ప్రదేశంలో ఈరోజు ఆలయం నిర్మించబడింది. ఈ రోజు ఆ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
ఈ విష్ణు దేవాలయాన్ని ముక్తినాథ్ దేవాలయంగా పిలుస్తారు. ఇది నేపాల్‌లోని ముక్తినాథ్ లోయలోని ముస్తాంగ్‌లోని తోరోంగ్ లా పర్వతంపై ఉంది. ముక్తినాథ్ ధామ్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో విష్ణువుని శాలిగ్రామ రూపంలో పూజిస్తారు.
విష్ణువు ఎందుకు శపించబడ్డాడు?
పురాణాల ప్రకారంన బృందా దేవి భర్త అయిన రాక్షస రాజు జలంధరుడి భీభత్సం సృష్టిస్తూ విశ్వమంతా అల్లకల్లోలం అయ్యేంతలా చేశాడు. దీనితో కలత చెందిన దేవత మహా విష్ణువును చేరుకుని జలంధరుడి నుండి అందరినీ రక్షించమని వేడుకున్నాడు. దేవతలందరూ జలంధరుని చంపడం చాలా ముఖ్యం అన్నారు. తనిని చంపడం అంత సులభం కాదు ఎందుకంటే.. జలంధరుడి భార్యకు ఉన్న భక్తీ అతనిని కాపాడుతుంది. జలంధరుడి ఎవరూ ఓడించలేరు.
దేవతలకు హామీ ఇచ్చిన శ్రీ మహా విష్ణు
విష్ణువు ఈ దేవతలకు జలంధరుడి నుంచి కాపాడతానని హామీ ఇచ్చాడు. దీంతో తన లీలలను ప్రదర్శిస్తూ విష్ణువు బృంద భర్త జలంధరుడి రూపంలో బృందా ముందు కనిపించాడు. బృందా విష్ణువు చర్యలను అర్థం చేసుకోలేకపోయింది. అతనిని తన భర్తగా భావించి అతని పాదాలను తాకింది. అలా బృందా విష్ణువు పాదాలను తాకగానే.. దేవతలు జలంధరుడిని యుద్ధంలో వధించారు. ఈ విషయం తెలుసుకున్న బృంద నువ్వు ఎవరు అని అడిగింది. అప్పుడు విష్ణువు తన నిజరూపాన్ని ధరించాడు.
బృందా దేవి శాపం
శ్రీ మహా విష్ణువు నిజరూపంలో రాగానే బృందా బాధతో అన్నది ప్రభూ నేను నిన్ను ఎప్పుడూ పూజిస్తూనే ఉన్నావు. అయినా నువ్వు ఎందుకు ఇలా చేశావు.. ప్రశ్నించింది. అంతేకాదు శ్రీ మహా విష్ణువుని రాయిగా మారమని శపించింది. దీంతో శ్రీ మహా విష్ణువు తన భక్తురాలు బృందని గౌరవించి రాయిగా మారాడు.
విష్ణువు శాపం నుండి విముక్తి పొందిన స్థలం
ఈ విషయం లక్ష్మీదేవికి తెలియగానే.. ఆమె బృందావద్దకు వెళ్లి తన భర్తను క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకోమని.. లేకపోతే విశ్వం పనితీరు ఆగిపోతుందని వేడుకుంది. దీంతో బృందా దేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంది. తన భర్తతో పాటు బృంద దేవి తన శరీరాన్ని విడిచిపెట్టింది. సతీసహగమనం చేసింది.
సతీసహగమనం చేసిన అనంతరం బృందాదేవి శరీరం పంచభూతాల్లో కలిసి ఒక బూడిద ఏర్పడింది. ఆ భస్మం నుంచి ఒక మొక్క ఉద్భవించింది. శ్రీ మహా విష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టారు. తులసి దేవి తన శాలిగ్రామ విగ్రహంతో వివాహం చేసినట్లు ఇక నుంచి శాలిగ్రామ సతీదేవి తులసి దేవిగా పూజింపబడుతుందని వరం ఇచ్చాడు. లక్ష్మీదేవి సలహా మేరకు బృందా దేవి విష్ణువును శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశం నేడు ముక్తినాథ్ ధామ్ అని పిలువబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు