Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భర్త కోసం బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసిన భార్య.. మెచ్చుకోలేదని ఆగ్రహించి భర్తకు విషం ఇచ్చిన మహిళ.. ఎక్కడంటే

స్త్రీని అవమానించడం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు కూడా.. మిస్సౌరీలో నివసిస్తున్న ఒక వ్యక్తి 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలను జరపడానికి ఆ వ్యక్తీ భార్య ఒక పార్టీని ఏర్పాటు చేసింది. అయితే ఈ బర్త్ డే పార్టీని భర్త బాగుంది అని అభినందించలేదు. దీంతో ఆ భార్యకు తన భర్త పట్ల కోపం వచ్చింది. తన శ్రమను గుర్తించని భర్తను హత్య చేయాలనీ ప్లాన్ చేసింది.

Viral News: భర్త కోసం బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసిన భార్య.. మెచ్చుకోలేదని ఆగ్రహించి భర్తకు విషం ఇచ్చిన మహిళ.. ఎక్కడంటే
Michelle PetersImage Credit source: Facebook/ Laclede County Sheriffs Office
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2024 | 12:53 PM

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండడం సర్వ సాధారణం. ఒకప్పుడు భార్యలను బాధపట్టిన సంఘటలు ఎక్కువగా వినిపిస్తే.. ప్రస్తుతం భర్తతో పాటు భార్య కూడా సమానమే అంటూ భర్త జీవితానికి భార్యే శత్రువుగా మారుతున్న ఘటనల గురించి తరచుగా వినిపిస్తున్నాయి. తాజాగా భార్య బాధిత భర్తకు సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మిస్సోరిలో ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఓ స్త్రీ తన భర్త బర్త్‌డే పార్టీ విషయంలో వచ్చిన కోపంతో ఏకంగా భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. భర్త తాగే శీతల పానీయంలో ‘రౌండ్ అప్’ అనే క్రిమి సంహారక మందు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అందరినీ కలచివేసింది.

స్త్రీని అవమానించడం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు కూడా.. మిస్సౌరీలో నివసిస్తున్న ఒక వ్యక్తి 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలను జరపడానికి ఆ వ్యక్తీ భార్య ఒక పార్టీని ఏర్పాటు చేసింది. అయితే ఈ బర్త్ డే పార్టీని భర్త బాగుంది అని అభినందించలేదు. దీంతో ఆ భార్యకు తన భర్త పట్ల కోపం వచ్చింది. తన శ్రమను గుర్తించని భర్తను హత్య చేయాలనీ ప్లాన్ చేసింది. ఈ ఘటన గత నెల జూన్ 24న చోటు చేసుకుంది. అయితే ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. తన భార్య తనకు విషం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తన వద్ద తగినన్ని సాక్ష్యాలున్నాయని లాక్లేడ్ కౌంటీ షెరీఫ్ ఆఫీసుకు తెలియజేసినట్లు సమాచారం.

సీసీటీవీ కెమెరా ద్వారా వెలుగులోకి వచ్చిన నిజం

ఇవి కూడా చదవండి

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఒక రోజు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన మౌంటెన్ డ్యూ బాటిల్ విచిత్రమైన రుచిని కలిగి ఉందని, దానిని తాగిన తర్వాత తనకు విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయని ఆ భర్త పోలీసులకు తెలిపాడు. అనంతరం తన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో అతని భార్య ఒక సోడా బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో రౌండ్ అప్ అనే కలుపు మందు ను వేసి ట్యాంపరింగ్ చేస్తున్నట్లు కెమెరాలో రికార్డ్ అయిన విషయం, చూశారు. అప్పుడు ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు భార్య, భర్తలను విచారించగా.. వారు పలు కారణాలను చెప్పారు.

భర్తకు విషం ఇవ్వడం వెనుక విచిత్ర కారణం.

తన పేరు మీద ఉన్న 5 లక్షల డాలర్ల జీవిత బీమా పాలసీ కోసం తన భార్య చంపడానికి ప్రయత్నించి ఉండవచ్చు అని లేదా తన భార్యకు ఏదైనా ఎఫైర్ ఉండి ఉండవచ్చని.. దీని కారణంగా ఆమె నన్ను వదిలించుకోవాలని కోరుకుందని ఆ భర్త చెప్పాడు. అయితే పోలీసులు అతని భార్యతో మాట్లాడినప్పుడు.. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు. తన భర్త తన కోసం 50 వ పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసినట్లు.. కనీసం తనకు థాంక్స్ కూడా చెప్పలేదని.. తనని ప్రశంసించలేదని అందుకే తనకు కోపం వచ్చిందని చెప్పింది. దీంతో తన భర్తను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని తాను భావించానని ఆ మహిళ పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..