Diwali 2023: దీపావళితో పాటు 5 పండుగలు ఎందుకు జరుపుకుంటారు? ఏ పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి

హిందూ మతంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి అనేక రకాల పురాణ కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని.. రామయ్య రాకను స్వాగతిస్తూ తమ సంతోషాన్ని దీపాలు వెలిగించి అయోధ్య ప్రజలు తెలిపారని.. అప్పటి నుంచి దీపావళి జరుపుకునే సంప్రదాయం మొదలైందని ఒక నమ్మకం.

Diwali 2023: దీపావళితో పాటు 5 పండుగలు ఎందుకు జరుపుకుంటారు? ఏ పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి
Diwali 2023
Follow us

|

Updated on: Oct 30, 2023 | 3:23 PM

హిందూ మతంలో దీపావళి పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లోక కంఠకుడైన నరకాసుడిని వచ్చింది లోకానికి మేలు చేసినందుకు ప్రజలు ఆనందంతో జరుపుకున్న పండగ దీపావళి. నరకాసురుడు మరణించిన రోజుని నరక చతుర్దశి అని.. మర్నాడు ఆశ్వయుజ అమావాస్య రోజుని దీపావళి పండగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ ఏడాది దీపావళి పండగ నవంబర్ 12వ తేదీన జరుపుకోనున్నారు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం., ఈ పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో జరుపుకుంటారు. లక్ష్మీదేవి జన్మించిన రోజుగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు కొందరు. గణపతిని, కుబేరుడిని కూడా దీపావళి రోజున పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు దీపావళి పండగకు సంబంధించిన హిందూ మత విశ్వాసాలను వివరంగా తెలుసుకుందాం.

దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే..

హిందూ మతంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి అనేక రకాల పురాణ కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని.. రామయ్య రాకను స్వాగతిస్తూ తమ సంతోషాన్ని దీపాలు వెలిగించి అయోధ్య ప్రజలు తెలిపారని.. అప్పటి నుంచి దీపావళి జరుపుకునే సంప్రదాయం మొదలైందని ఒక నమ్మకం. అంతేకాదు సముద్ర మథనం తర్వాత, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున ప్రత్యక్షమైందని కూడా నమ్ముతారు. పాండవులు  అరణ్యవాసం, అజ్ఞాతవాసాన్ని ముగించుకుని ఈ రోజున తిరిగి వచ్చారని కొందరు నమ్ముతారు, మరికొందరు దీనిని విక్రమాదిత్య రాజు పట్టాభిషేక దినంగా భావిస్తారు. ఇంకొందరు నరకాసుడిని వధించిన సందర్భంగా తమ సంతోషాన్ని తెలుపుతూ అమావాస్యలో వెలుగులు దీపాలను వెలిగించి నింపారని విశ్వాసం.

ధన్‌తేరాస్: 10 నవంబర్ 2023 శుక్రవారం

ఇవి కూడా చదవండి

నరక చతుర్దశి : 11 నవంబర్ 2023, శనివారం

దీపావళి: 12 నవంబర్ 2023, ఆదివారం

గోవర్ధన పూజ : 14 నవంబర్ 2023, మంగళవారం

అన్నా  చెల్లెల పండగ : 15 నవంబర్ 2023, బుధవారం

బౌద్ధమతానికి సంబంధించిన వ్యక్తులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారంటే?

దీపావళికి సంబంధించి బౌద్ధమతంతో ఒక నమ్మకం ఉంది. ఈ రోజున గౌతమ బుద్ధుడు 18 సంవత్సరాల తర్వాత తన జన్మస్థలమైన కపిల్వాస్తుకు తిరిగి వచ్చాడు. బుద్ధుని అనుచరులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని ప్రతీతి. అప్పటి నుండి భౌద్ధమతానికి చెందిన ప్రజలు ఈ రోజున తమ ఇళ్లలో దీపాలు వెలిగించి  పండుగను జరుపుకుంటారు.

దీపావళికి సంబంధించి జైనమతానికి సంబంధించిన నమ్మకం

జైనులు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బీహార్‌లోని పావపురిలో దీపావళి రోజున మోక్షం పొందాడని నమ్ముతారు. ఈ ఆనందంలో  జైనులు దీపాలు వెలిగించి భగవంతుడిని పూజిస్తారు. అయినప్పటికీ.. జైనులు దీపావళి రోజున గణేశుడు, లక్ష్మిదేవి, సరస్వతిని కూడా పూజిస్తారు.

దీపావళిని పంచమహాపర్వ అని ఎందుకు అంటారంటే..

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దీపావళి పండగ కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. కొందరు దీపావళి ని 5 రోజులు జరుపుకుంటారు. మొదట ధన్‌తేరస్ వస్తుంది. ఈ రోజు ధన్వంతరిని పూజించే సంప్రదాయం ఉంది. రెండవ రోజు చోటి దీపావళిని చతుర్దశి తేదీన జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. దీపావళి రోజున శ్రీ గణేశుడిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని, కాళీ మాతను, సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది. గోవర్ధన్ పూజ నాల్గవ రోజు, అన్నచెల్లెల పండగను ఐదవ రోజు జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.