Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలున్నాయా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..

భారతీయులను, వాస్తును విడదీసి చూడలేము. అందుకే ఇంటి నిర్మాణానికి వాడే మెటిరీయల్‌ ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటారో, వాస్తు కూడా అంతే పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే తెలియకో, స్థలం సరిపోకో కొన్ని సందర్భాల్లో వాస్తులో దోషాలు ఉంటుంటాయి. ఇలాంటి దోషాల కారణంగా ఇంట్లో వారి శారీరక ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలను నివారించుకునేందుకు...

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలున్నాయా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 30, 2023 | 2:15 PM

ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ప్రతీ ఒక్కరూ వాస్తు పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. వాటికి అనుకూలంగానే ఇంటి నిర్మాణాన్ని చేపడుతారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆరోగ్య పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు.

మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేము. అందుకే ఇంటి నిర్మాణానికి వాడే మెటిరీయల్‌ ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటారో, వాస్తు కూడా అంతే పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే తెలియకో, స్థలం సరిపోకో కొన్ని సందర్భాల్లో వాస్తులో దోషాలు ఉంటుంటాయి. ఇలాంటి దోషాల కారణంగా ఇంట్లో వారి శారీరక ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలను నివారించుకునేందుకు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నా మనుషులపై ప్రభావపం పడుతుంది. ఇంట్లో ఉన్న దోషాలను తొలగించుకుంటే ఈ నెగిటివ్‌ ఎనర్జీని పారద్రోలొచ్చు. ఇంట్లో వాస్తు దోషాన్ని కర్పూరంతో చెక్‌ పెట్టొచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ కర్పూరంతో ఎలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. ఇంట్లోని ప్రతీ గదిలోని అన్ని మూలల్లో కర్పూరాన్ని ఉంచాలి. ఒకవేళ కర్పూరం కరిగిపోతే తిరగి మరో కర్పూరాన్ని ఉంచాలి. కానీ మూలల్లో ఎప్పుడూ కర్పూరం ఉండేలా చూసుకోవాలి.

ఇక ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. ఇక రాత్రివేళ వంటగదిలో ఒక శుభ్రమైన డబ్బాలో కర్పూరం, లవంగాలను కలిపి కాల్చితే మంచి జరుగుతుంది. దీంతో పాటు స్నానం చేసే ముందు నీటిలో కొన్ని చుక్కల కర్పూర నూనెను వేసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలో ఉత్తేజంగా మారుతుంది. లవంగం, కర్పూరాన్ని కాల్చి ఇల్లంతా ధూపం వేస్తే వాస్తు దోషాలు పోతాయి.

ఇంట్లో ప్రతీ మూలన కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇంట్లో సిరిసందలకు కొదవులేకుండా ఉండాలంటే.. సాయంత్రం ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించాలి. దీంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. చూశారుగా చిన్న కర్పూరంతో ఎన్ని రకాల వాస్తు సమస్యలకు పరిష్కారం లభిస్తుందో.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
కొడుకు ఇక లేడని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది...
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీ రెసిపీ మీ కోసం..సింపుల్ అండ్ ఈజీ
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు