AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శివుడికి మూడు సంఖ్యతో ఉన్న సంబంధం.. శివపూజ రహస్యం ఏమిటో తెలుసా..!

శివుని 3 అంకెల రహస్యం శివపురాణంలోని త్రిపురాద కథలో వివరించబడింది. శివ పురాణం కథ ప్రకారం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను సృష్టించారు. తద్వారా వారు అజయులుగా మారారు. రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు. ఈ మూడు నగరాలు వేర్వేరు దిశల్లో ఎగురుతూనే ఉండేవి. రాక్షసులు భీభత్సం సృష్టించి తమ నగరాలకు వెళ్లేవారు, దీనివల్ల ఆ రాక్షసులను ఎవరూ ఏమీ చేయలేక పోయారు.

Lord Shiva: శివుడికి మూడు సంఖ్యతో ఉన్న సంబంధం.. శివపూజ రహస్యం ఏమిటో తెలుసా..!
Lord Shiva
Surya Kala
|

Updated on: May 31, 2024 | 12:24 PM

Share

సృష్టి లయకారుడు, భోలాశంకరుడు శివునికి.. 3వ సంఖ్యతో చాలా లోతైన సంబంధం ఉంది. పరమశివునికి సంబంధించిన ప్రతిదీ 3 సంఖ్యతో ముడిపడి ఉంటుంది. మూడవ సంఖ్య చాలా శుభప్రదం అని ప్రజల నమ్మకం. ఈ సంఖ్యను పాలించే గ్రహం బృహస్పతి. బృహస్పతికి ఆరాధ్యదైవం విష్ణువు. అందుకే మూడు సంఖ్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడి పూజలో మూడవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.

గ్రంథాలలో మూడు సంఖ్యల ప్రాముఖ్యత గ్రంథాల ప్రకారం రోజుని నాలుగు ప్రహార్లుగా (నాలుగు జాములు) విభజించారు. ఇందులో మూడవ జాము అంటే సాయంత్రం సమయం శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ కాలాన్ని ప్రదోష కాలమని కూడా అంటారు. ఈ సమయంలో శివుడిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివ లింగానికి సమర్పించే బిల్వ పత్రంలో మూడు ఆకులు ఉంటాయి. ఈ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపమని చెబుతారు.

మూడు సంఖ్యకు సంబంధించిన శివుని రహస్యం శివుని 3 అంకెల రహస్యం శివపురాణంలోని త్రిపురాద కథలో వివరించబడింది. శివ పురాణం కథ ప్రకారం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను సృష్టించారు. తద్వారా వారు అజయులుగా మారారు. రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు. ఈ మూడు నగరాలు వేర్వేరు దిశల్లో ఎగురుతూనే ఉండేవి. రాక్షసులు భీభత్సం సృష్టించి తమ నగరాలకు వెళ్లేవారు, దీనివల్ల ఆ రాక్షసులను ఎవరూ ఏమీ చేయలేక పోయారు. రాక్షసుల నివాసమైన ఈ మూడు ఎగిరే నగరాలను ఒక్క బాణంతో నాశనం చేయవచ్చు. అయితే ఈ మూడు నగరాలు ఒకే లైన్‌పైకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాక్షసుల భీభత్సం వల్ల దేవతలు కూడా అనేక బాధలు పడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

శివుడిని త్రిపురారి అంటారు త్రిపుర రాక్షసుల భయంతో కలత చెందిన దేవతలందరూ శివుడిని ఆశ్రయించారు. దేవతలను రాక్షసుల నుంచి రక్షించడానికి శివుడు భూమిని రథంగా చేసాడు. సూర్యుడు, చంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. ఆది శేషుడు విల్లుగా మారాడు. శ్రీమహావిష్ణువు బాణంగా మారడంతో మందర పర్వతాన్ని అధిరోహించిన శివుడు ఒక రోజు మూడు నగరాలు సరళ రేఖలో వచ్చిన క్షణంలో శివుడు రెప్పపాటులో బాణం వేశాడు. శివుని బాణాల వల్ల మూడు నగరాలు బూడిదయ్యాయి. ఈ మూడు నగరాలను దహనం చేసిన తరువాత.. శివుడు ఈ మూడు నగరాల బూడిదను తన శరీరంపై పుసుకున్నాడు. త్రిపుర రాక్షసులను సంహరించిన శివుడిని త్రిపురారి అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి శివుని ఆరాధనలో మూడుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధం త్రిశూలం. ఈ ఆయుధం కూడా మూడు సంఖ్యతో శివుని సంబంధాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మూడు అంచులు ఉన్న ఏకైక ఆయుధం త్రిశూలం. ఇందులో ఆకాశం, భూమి, పాతాళం ఉన్నాయి. అనేక పురాణాలలో త్రిశూలం తామసిక గుణము, రాజసిక గుణము, సాత్విక గుణము వంటి మూడు గుణములతో కూడియున్నది.

త్రినేత్రుడు శివుడికి మూడు కళ్ళు ఉన్నాయి. అందుకనే శివయ్యను త్రినేత్రుడు అని అంటారు. శివునికి కోపం వచ్చినప్పుడు మూడో కన్ను తెరుస్తాడని విశ్వాసం. శివుని త్రినేత్రం తెరిచినప్పుడు భూమిపై పాపాలు నశిస్తాయి. అలాగే శివుని మూడు కళ్ళు తపస్సును సూచిస్తాయి. ప్రయోజనం, మనస్సు , ఆనందం. సంపూర్ణ సత్యం, స్వచ్ఛమైన స్పృహ, సంపూర్ణ ఆనందం అని అర్థం.

త్రిపుండ్రాలు శివుని నుదిటిపై మూడు రేఖలతో విభూదితో అలంకరిస్తారు. వీటిని త్రిపుండ్రాలు అని కూడా అంటారు. ఇందులో స్వీయ సంరక్షణ, స్వీయ ప్రచారం, స్వీయ సాక్షాత్కారం ఉన్నాయి. శివుని త్రిపుండ్రాలు ప్రపంచంలోని మూడు లక్ష్యాలను సూచిస్తుంది. స్వీయ సంరక్షణ, స్వీయ ప్రచారం, స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటుంది. ఇది వ్యక్తి సృష్టి, రక్షణ, అభివృద్ధికి చిహ్నం,

బిల్వ పత్రాలు మూడు ఆకుల బిల్వపత్రం లేదా బిల్వ పత్రాలను ఎల్లప్పుడూ శివుని పూజలో వినియోగిస్తారు. శివయ్యకు సమర్పిస్తారు. బిల్వ పత్రంలో మూడు ఆకులు కలిసి ఉంటాయి. బిల్వ పత్రం లేని శివుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపమని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు