AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan Tickets: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దర్శన టికెట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం

TTD on Darshan Tickets: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ఆలయం కరోనాకు ముందు ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో ఉండేది. భారీ సంఖ్యలో స్వామివారిని..

Darshan Tickets: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దర్శన టికెట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం
Ttd Eo Jawahar
Surya Kala
|

Updated on: Jul 23, 2021 | 9:18 PM

Share

TTD on Darshan Tickets: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ఆలయం కరోనాకు ముందు ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో ఉండేది. భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చేవారు అయితే కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించింది. ఓ వైపు సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతునే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ రానున్నది ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పట్లో స్వామివారి దర్శన టికెట్ల సంఖ్య పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.తిరుమాఢ వీధుల సమీపంలో ఉన్న ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలను అధికారులతో కలిసి ఈవో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో తీసుకుని రానున్న మార్పుల గురించి వెల్లడించారు. భక్తులకు ఆహ్లాదరకర వాతావరణం ఉండేలా పార్కులను ఏర్పాటు చేస్తామని.. కాటేజీలు, రహదారుల పక్కన మొక్కలను పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు స్వామివారి అలంకరణకు ఉపయోగించే పూలను తిరుమలలోనే సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక ఆగస్టు 15 నుంచి శ్రీవారి అనుబంధ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తుల తయారీ ప్రారంభించనున్నామని జవహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటీకే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. తిరుమలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు అందుబాటులో తీసుకొస్తామన్నారు. అగరబత్తుల విక్రయంతో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గో-సంరక్షణ ట్రస్ట్‌కు మళ్లిస్తామని చెప్పారు. స్వామివారికి కైంకర్యాలు, నైవేద్యాల తయారీకి వినియోగించే నెయ్యిని తిరుమలలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. దేశవాళీ ఆవు పాలతోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు.

Also Read: Jr.NTR-Ram Charan: తన ఖరీదైన కొత్త కారుతో ముందుగా మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి సందడి చేసిన ఎన్టీఆర్..