Tirumala Tirupati Devasthanam: ఇప్పటికింతే.. శ్రీవారి దర్శనాలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఈవో..
Tirumala Tirupati Devasthanam: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Tirumala Tirupati Devasthanam: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. దీంతో చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనానికై వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలను పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్పందించారు. శ్రీవారి దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగిన తరువాత.. దర్శనాలపై పునరాలోచన చేస్తామన్నారు.
ఇదిలాఉంటే.. శ్రీవారికీ వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా.. మరిన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నామని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. అలాగే గోఆధారిత నెయ్యిని సొంతంగా సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నాని చెప్పారు. తిరుమలలో నిర్మించిన అదనపు బూందీ పోటు భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఆగష్టు 15వ తేదీ నుంచి నుంచి పుష్పాలతో అగరబత్తులను తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ అగరబత్తుల తయారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణ ట్రస్ట్‌కు ఇస్తామని ఈవో జవహార్ రెడ్డి చెప్పారు.
తిరుమలలో యాంటీ డ్రోన్ అటాక్ మిషన్లు.. తిరుమల పుణ్యక్షేత్రంపై డ్రోన్‌ల సంచారం, దాడిని ఎదుర్కొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యాంటీ డ్రోన్ ఎటాక్ మిషనరీని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. తిరుమలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలుమార్లు నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, మిషనరీ కొనుగోళ్లకు సంబంధించి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది.
Also read:
Trisha: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్ ?.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న త్రిష పెళ్లి టాపిక్..