AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: రేపు తిరుమలలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం.. అన్ని రకాల బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి....

TTD: రేపు తిరుమలలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం.. అన్ని రకాల బ్రేక్ దర్శనాలు రద్దు..
Ttd
Ganesh Mudavath
|

Updated on: Dec 26, 2022 | 8:05 AM

Share

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం సందర్భంగా మంగళవారం బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. సోమవారం సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని టీటీడీ వెల్లడించింది. మరోవైపు.. తిరుమలలో 14 క్యూ కంపార్ట్‌మెంట్‌లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులే కాకుండా దుకాణదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తిరుమలలో రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఏకాదశి నాడు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య వైరస్ వ్యాప్తి కారణంగా టీటీడీ అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టింది. యాత్రికులు, భక్తులు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రిజర్వేషన్ టిక్కెట్లను ఈ ఉదయం విడుదల చేశారు. ప్రత్యేక దర్శనం కోసం టిక్కెట్లతో వచ్చే భక్తులు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని టీటీడీ సూచిస్తోంది. ధ్రువపత్రాలు లేకుండా వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల దేవస్థానం బోర్డు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు