AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే… శత్రువులపై మీరే విజయం సాధిస్తారు..

ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే... శత్రువులపై మీరే విజయం సాధిస్తారు..
Zodiac Signs
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2022 | 6:49 AM

Share

మేషం మేషరాశివారికి ఈ రోజు చాలా సంతోష దినంగా చెప్పొచ్చు. ఈ వారికి ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం

వృషభం వృషభ రాశివారికి ఈ రోజున మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.

మిథునం మిథున రాశివారు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం కర్కాటక రాశివారికి ఇది మంచి కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

సింహం సింహ రాశివారు మనోబలంతో చేసే పనులు ఫలితాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

కన్య కన్య రాశివారికి ఈ రోజు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి.. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది.

తుల తుల రాశివారికి ఈ రోజు మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం వృశ్చిక రాశివారు గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

ధనుస్సు ధనుస్సు రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

మకరం మకర రాశివారికి మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.

కుంభం కుంభ రాశివారికి ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్ర నామాలు పారాయణం చేయడం మంచిది.

మీనం మీన రాశివారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి