Horoscope Today: ఆ రాశులవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. సోమవారం రాశి ఫలాలు..
రాశిఫలాలు ద్వారానే చాలామంది కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. మరి ఈరోజు (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు రాశి ఫలాలతోనే తమ రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. మరి ఈరోజు (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషంగా లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు మంచి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగానే సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఖర్చుల్ని బాగా అదుపు చేయాలి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : వృత్తి ఉద్యోగాల్లో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్ని విధాలుగాను లాభసాటిగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆదాయం పెంచుకోవడానికి గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : విధి నిర్వహణలో ఆచితూచి అడుగు వేయాలి. కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. బంధు వర్గంలో ప్రతిష్ట పెరుగుతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఉద్యోగంలో ఈ ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న పని ఒకటి అనుకోకుండా పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులు ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులను అదుపు చేయాల్సి ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా లేదు. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపార పరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం,ధనిష్ట 1,2) : మనసులో చాలా కాలం నుంచి ఉన్న కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదు. ఆదాయం గురించి ఒక శుభవార్త వింటారు. ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తి వ్యాపారాల వారు అభివృద్ధి సాధిస్తారు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆరోగ్యం అనుకూలిస్తుంది. వ్యాపారం ఆర్థికపరంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయపడతారు. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి నిపుణులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశ కావేశాలకు దూరంగా ఉండాలి. హామీలు ఉండవద్దు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రతికూలత కనిపిస్తోంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి