AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almond Benefits : చలికాలంలో బాదం పప్పు ప్రయోజనాలు పుష్కలం.. ఎలా తినాలంటే

మనం రోజువారీ ఆహారంలో బాదంపప్పును భాగం చేసుకోవచ్చు. చలికాలంలో, మనం బాదంపప్పును అనేక రకాలుగా తినవచ్చు,

Almond Benefits : చలికాలంలో బాదం పప్పు ప్రయోజనాలు పుష్కలం.. ఎలా తినాలంటే
Almond
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2022 | 9:12 PM

Share

బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే బాదంను సూపర్ ఫుడ్స్ అంటారు. ఇందులో ఫైబర్, విటమిన్ ఇ, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని ప్రభావాలు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. కాబట్టి చలికాలంలో బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం రోజువారీ ఆహారంలో బాదంపప్పును భాగం చేసుకోవచ్చు. చలికాలంలో, మనం బాదంపప్పును అనేక రకాలుగా తినవచ్చు, ఈరోజు ఇక్కడ ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వేయించిన బాదంపప్పులను ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినవచ్చు. వేయించిన బాదం చాలా రుచికరమైనది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీరు బాదం ఎక్కువగా తినకపోతే ఈ బాదం పప్పులను మెత్తగా చేసి లడ్డూలను తయారు చేసుకోవచ్చు. వీటిని ప్రతిరోజూ అల్పాహారంగా తినవచ్చు. బాదామ్‌ లడ్డూలు కూడా తినడానికి రుచిగా ఉంటాయి.

బాదామ్‌ హల్వా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చలికాలంలో తింటారు. బాదంపప్పుతో చేసే ఈ హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదామీ హల్వా తింటే శరీరానికి బలం చేకూరి రోగాలు నయమవుతాయి.

ఇవి కూడా చదవండి

బాదం పాలు: బాదంపప్పును పాలలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న బాదం పాలు శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది మరియు శక్తినిస్తుంది.

నానబెట్టిన బాదంపప్పులు: నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నానబెట్టిన బాదంపప్పు శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఈ బాదం మెదడుకు చాలా మేలు చేస్తుంది. ఇవి బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!