Winter Skin Care Tips: శీతాకాలంలో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా? ఇవి తిన్నారంటే చర్మ సమస్యలు ఫసక్..
చర్మ వ్యాధుల స్పెషలిస్టులు మాత్రం పోషకాహారం, అధిక నీటి వినియోగంతో శీతా కాలం చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ఈ సీజన్ లో దొరికే అద్భుత ఆహారాల వల్ల మేలు కలుగుతుందని సూచిస్తున్నారు.
శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిని చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో సున్నిత చర్మంపై పగుళ్లు వచ్చి బాగా నొప్పి వస్తాయి. అలాగే చర్మం కూడా త్వరగా పొడిబారి పోతుంది. అలాగే ఈ సీజన్ లో వచ్చే ఇతర ఇబ్బందుల వల్ల కూడా మన చర్మం చూడడానికి అంతగా బాగోదు. అయితే ఇలాంటి సమయంలో అందరం మాయిశ్చరైజర్లను ఆశ్రయిస్తాం. అవి కూడా కొంత సేపే మెరుపునిస్తాయి కానీ శాశ్వతంగా పని చేయవు. అయితే నిపుణులు సూచించే ఆ అద్భుత ఆహారాలేంటో ఓ లుక్కేద్దాం.
క్యారెట్:
క్యారెట్ అంటే శీతాకంలంలో దొరికే అద్భుత ఆహారం. శీతాకాలంలో క్యారెట్ ను అధికంగా వినియోగిస్తే చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు కొలాజిన్ ఉత్పత్తి చేస్తుందని వివరిస్తున్నారు. అలాగే చర్మాన్ని బలోపేతం చేయడంతో పాటు చర్మాన్ని గ్లోయింగ్ గా కనిపించేలా చేస్తుందని పేర్కొంటున్నారు.
బచ్చలి కూర :
బచ్చలి కూరలో ఉన్న అనేక రకాలైన విటమిన్లు చర్మాన్ని కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు ఏ, సీ, ఈ చర్మ రక్షణకు చాలా ముఖ్యమని నిపుణుల అభిప్రాయం. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని డీ హైడ్రేషన్, వాపు, వైరల్ ప్రభావాలు లేకుండా చేస్తాయి. అధికంగా బచ్చలి కూర తింటే వయస్సు రీత్యా వచ్చే చర్మం ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు.
దానిమ్మ :
దానిమ్మ చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ముఖంపై వచ్చే మొటిమల తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే చర్మంలోని ఆయిల్ స్థాయిలను మెయిన్ టెయిన్ చేయడానికి పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కమల, నారింజ :
ఇవి శీతాకాలంలో మాత్రమే దొరికే అద్భుత పండ్లు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జామ:
జామ కాయల్లో విటమిన్లు ఏ,సీ అధికంగా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, లైకోపిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మ రక్షణకు అవసరమైన కొల్లాజిన్ ను ఉత్పత్తి చేయడంలో సాయం చేస్తుంది. జామకాయలను తింటే వృద్ధాప్య సమస్యలను నుంచి బయటపడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..