- Telugu News Photo Gallery Experts say that cloves provide good benefits to diabetic sufferers Telugu news
డయాబెటిక్ బాధితులకు లవంగాలు అద్భుత వరం.. ఇలా చేశారంటే అద్భుత ప్రయోజనాలు..
లవంగం.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మసాలా దినుసులుగా వాడే పదార్థాల్లో అత్యంత ముఖ్యమైనవి లవంగాలు. సుగంధద్రవ్యాల డబ్బాలో ఇవి ఉండి తీరాల్సిందే. వంటకం ఏదైనా దానిని రుచికరమైనదిగా మార్చడంలో ఇవి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అయితే కేవలం రుచికే మాత్రమే పరిమితం కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి...
Updated on: Dec 25, 2022 | 6:59 PM

లవంగాలకు ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అనేక రకాల పోషకాలు ఉన్నందునే మన పూర్వీకులు దీనిని మన వంటలలో ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కేవలం వంటలలోకే కాక విడిగా కూడా లవంగం ఎన్నో రకాలుగా మానవ ఆరోగ్యాన్ని కాపాడగలిగే ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు అనేకం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీర వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో కూడా లవంగం ఉపకరిస్తుంది.

లవంగాలను కాస్మొటిక్స్ తయారీలో, ఫార్మాస్యూటికల్స్‌లలో, వ్యవసాయ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలా మాత్రమే కాకుండా రోజూ మూడు పూటలా భోజనం తరువాత లవంగాలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో కూడా లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. ఇక లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి నొప్పులు, వాపులను సమసిసోతాయంటున్నారు. దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే తగ్గుతుందని వారు చెబుతున్నారు.





























