Watch Video: ఖరీదైన కార్లతో రోడ్లపై రెచ్చిపోయిన విద్యార్థులు.. నెట్టింట దూసుకెళ్తున్న వీడియో.. నెటిజన్ల ఆగ్రహం..

ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. విద్యార్థుల కార్ల విన్యాసాలను నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్‌ చేశారు. వారు ప్రమాదంలో పడటంతోపాటు ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తారంటూ కొందరు ఘాటుగా విమర్శించారు.

Suv Stunts
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2022 | 7:36 PM

కాలేజీ విద్యార్థులు ఖరీదైన బైకులు, కార్లు దొరికితే చాలు.. డేంజరస్‌ స్టంట్లు చేస్తూ జనాల్ని హడలెత్తిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో కొందరు విద్యార్థులు ఖరీదైన కార్లతో రోడ్లపై స్టంట్లు చేశారు. చివరకు వీడియో పోలీసులకు చేరటంతో దర్యాప్తు చేస్తున్నారు. వైరల్‌ వీడియో దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాకు చెందినదిగా గుర్తించారు. అమిటీ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు.

పంజాబీ ర్యాప్‌ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్‌ స్థలంలో కూడా ఒక కారుతో విన్యాసాలు చేశారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో ఈ వీడియో నోయిడా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కార్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేయడంపై దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. విద్యార్థుల కార్ల విన్యాసాలను నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్‌ చేశారు. వారు ప్రమాదంలో పడటంతోపాటు ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తారంటూ కొందరు ఘాటుగా విమర్శించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..

పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే

బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!

చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి