Ram Setu: యుగాల నాటి రామ రహస్యం.. రామసేతుపై పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే..
రామ సేతు నిజం కాదా? ఆనవాళ్లు కనిపిస్తున్నా... కచ్చితమైన ఆధారాలు దొరకలేదా? పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇదే స్పష్టం చేసిందా?
రామసేతు రగడ.. మరోసారి పార్లమెంటును తాకింది. ఏళ్లుగా వాదోపవాదాలకు కేంద్రబిందువైన ఈ అంశం… రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కేంద్రం సమాధానం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నతోనే.. మరోసారి రామసేతు అంశం పార్లమెంట్‌నే కాదు, దేశాన్నే షేక్‌చేసింది. ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రామసేతుపై క్లారిటీ ఇచ్చారు మంత్రి జితేంద్ర సింగ్. ఇన్నాళ్లు జరుగుతున్న చర్చోపచర్చలకు.. ఒక్క సమాధానంతో పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను ఇండియన్ శాటిలైట్స్ ఫైండవుట్ చేయలేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఇంకేముంది.. మేటర్ ఓవర్ అనుకోవచ్చు. కానీ, కేంద్రంలో ఉన్నది హిందుత్వానికి ప్రతీకగా భావించే బీజేపీ ప్రభుత్వం. అందుకే, ఈ వివరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రతిపక్షం.
రామసేతు ఫోటోలను ఇండియన్ శాలిలైట్స్ హై రిజల్యూషన్‌తో పిక్స్ తీశాయి. కానీ, సేతువు ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవన్నది ప్రభుత్వ వివరణ. అయితే, యూపీఏ హయాంలో, ఇదే సభలో.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పింది కూడా ఇదే కదా..! అంటోంది కాంగ్రెస్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ… తమను హిందూ వ్యతిరేక పార్టీగా విమర్శలు చేసిందంటూ మండిపడుతోంది. అలాగని రామసేతు లేదని కూడా కేంద్రం తేల్చేయలేదు. సముద్రంలో కొన్ని అవశేషాలను గుర్తించామనీ.. అవి కచ్చితంగా రామసేతుకు సంబంధించినవేనని చెప్పడం కష్టమనీ అంటోంది. 56కిలోమీటర్ల పొడవుతో.. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సేతువుకు సంబంధించి.. కొన్ని సున్నపురాయి ద్వీపాలను గుర్తించామంటోంది కేంద్రం. వాటిలో కొన్ని బండరాళ్లు ఆ వంతెనకు సంబంధించినవే అనిపిస్తోందని తెలిపింది. సముద్రం మధ్యలో ఏదో ఒక నిర్మాణమైతే ఉందన్నది మాత్రం.. సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్ని కేంద్రం వివరణ.
రామ్‌సేతుకు ఒక్కోచోట ఒక్కో పేరు!
తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఈ నిర్మాణానికి.. దక్షిణభారతంలో రామసేతు అని, శ్రీలంకలో అడాంగ పాలం అని పేరు. ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. కచ్చితంగా తెలియదు.. గానీ వేల సంవత్సరాల నాటి చరిత్ర. రాముడి కాలం త్రేతాయుగమైతే.. ఇప్పుడు నడుస్తున్నది లెక్కప్రకారం కలికాలం. అంటే, త్రేతాయుగంలో లంకను చేరేందుకు రాముడు.. సముద్రాన్ని చీలుస్తూ వానసేన సాయంతో, చేసిన నిర్మాణమే రామసేతు. అంటే, యుగాలు దాటిన కథ రామసేతుది. దీని చరిత్ర ఎంత పాతదో.. దీనిపై వాదోపవాదాలూ అంతే పాతవి. దీనిపై ఎన్నో పరిశోధనలు.. మరెన్నో వాదనలు.. వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగానూ నిలుస్తోంది. ప్రపంచ పరిశోధకులది సైతం.. రామసేతుపై స్పెషల్ ఇంట్రస్టే. దీనిపై నాసా కూడా పరిశోధనలు చేసినా.. ఎటూ తేల్చలేదు. దీనిపై టీవీ9 భారత్ వర్ష్‌లో దృశ్యం పేరిట.. స్పెషల్ రీసెర్చ్ కథనం కూడా ప్రసారమైంది.
గతంలోని యూపీఏ సర్కార్.. శ్రీలంక, భారత్ మధ్య సముద్ర మార్గం ప్రయాణాన్ని తగ్గించేందుకు సీతా సముద్ర ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. అయితే, దానివల్ల రామసేతు దెబ్బతినే ప్రమాదం ఉందని.. బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్ సహా ఇతర హిందుత్వ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఈ విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అయితే న్యాయస్థానం జోక్యంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినా.. రామసేతుపై విభిన్న వాదనలు మాత్రం ఆగలేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… 2021లో దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. రంగంలోకి దిగిన పరిశోధనా బృందం… మూడేళ్లపాటు రీసెర్చ్ చేసింది. దీని ఆధారంగానే కేంద్రం.. తాజా ప్రకటన చేసుండొచ్చన్నది విశ్లేషకుల మాట. రామసేతు ఆఖరుకు సినిమా కాంటెంట్‌గానూ మారింది. దీని ఆధారంగానే ఇటీవల.. అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో రామసేతు అనే సినిమా తెరకెక్కింది. దీంతో ఈ అంశం మళ్లీ రాజుకుంది. రామ సేతుకు ఉన్న ఇంపార్టెన్స్ కారణంగా ఈ సినిమాకి మంచి హైపే వచ్చింది. నాస్తికుడైన ఓ ఆర్కియాలజిస్ట్ రామసేతు నిర్మాణం మూలాల గురించి.. దాని వెనక నిజానిజాల గురించి తీసుకోవడమే దీని కథ. ఎవరెన్ని ఎప్పినా.. రామసేతు ఒక రామరహస్యం. పురావస్తు అధ్యయనాల ప్రకారం లక్షా75వేల సంవత్సరాల కిందటిది. ఇది కచ్చితంగా దైవాంశ సంభూతులే నిర్మించిన కట్టడమనే వారూ ఉన్నారు. రామాయణంలోని యుద్ధకాండలో దీని ప్రస్తావన కూడా ఉంది. అయితే, అదేం కాదు.. సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిన నిర్మాణమే ఈ సేతువని మరికొందరు వాదిస్తారు.
అంతుచిక్కని మిస్టరీగా రామ్‌సేతు
ఈ రామసేతు నిర్మాణంలో ఎన్నో అద్భుతాలనూ ఉదహరిస్తుంటారు చరిత్రకారులు. కొంతదూరం పాటు 3 కిలోమీటర్ల వెడల్పు, 30 మైళ్ల పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైందనే విషయం.. ఇప్పుటికీ అంతుచిక్కని ప్రశ్నే అంటారు. దానికోసం వాడిన.. తేలాడే రాళ్లు ఇప్పటికీ రామేశ్వరం ప్రాంతంలో దర్శనమిస్తుంటాయి. శతాబ్దాలుగా వీడని మిస్టరీగా ఉన్న ఈ అద్భుతంపై… ఆస్తికులు, నాస్తికులకు మధ్య సవాలక్షసార్లు వాదనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయ్. ఇక ముందూ జరుగుతూనే ఉంటాయ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..