Hair care: పొడవాటి అందమైన, మెరిసే జుట్టు కోసం.. ఈ బెస్ట్ హోం రెమిడీ ట్రై చేయండి..

పొడిని నీటిలో వేసి మరిగించి, నీరు చల్లబడినప్పుడు, దానిని మీ తలపై స్ప్రే చేసి, 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

Hair care: పొడవాటి అందమైన, మెరిసే జుట్టు కోసం.. ఈ బెస్ట్ హోం రెమిడీ ట్రై చేయండి..
Hair Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2022 | 4:15 PM

పురుషులు లేదా మహిళలు ఇద్దరూ అందమైన, ఒత్తైన, బలమైన జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి గజి బిజీ జీవనశైలిలో మన జుట్టుపై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. దీని వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా జుట్టు సమస్యలతో బాధపడుతుంటే, చింతించకండి ఎందుకంటే మీ జుట్టును వేగంగా ఎలా పెంచుకోవాలో ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే..మీరు కోరుకున్న ఒత్తైన, మృదువైన కేశాలు సొంతం చేసుకోవచ్చు.. దీని కోసం మీరు నీటిలో కొన్నింటిని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇది మీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

రైస్ వాటర్: అన్నం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. దీంతో జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారుతుంది. దీన్ని ఉపయోగించడానికి, 3 కప్పుల నీటిలో అర కప్పు బియ్యాన్ని ఉడకబెట్టి, ఆపై నీటిని ఫిల్టర్ చేసి, దానికి కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

టీ పౌడర్: జుట్టుకు మెరుపును జోడించడానికి, సహజంగా జుట్టుకు రంగు వేయడానికి టీ పొడిని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. టీ పౌడర్ నీళ్లను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. దీనిని ఉపయోగించడానికి మూడు చెంచాల టీ పొడిని నీటిలో వేసి మరిగించి, నీరు చల్లబడినప్పుడు, దానిని మీ తలపై స్ప్రే చేసి, 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.