AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Tikka Recipe: రెస్టారెెంట్ స్టైల్లో చికెన్ టిక్కా చేయాలా? సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే సూపర్ టేస్ట్..

కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇంత టేస్టీ రెసిపీ ఇంట్లో వాళ్లకు పెడితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

Chicken Tikka Recipe: రెస్టారెెంట్ స్టైల్లో చికెన్ టిక్కా చేయాలా? సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే సూపర్ టేస్ట్..
Chicken Tikka Masala
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 24, 2022 | 4:17 PM

Share

క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఇంటిళ్లపాది ఒకేచోట ఆహ్లాదంగా గడుపుతున్నారు. పైగా ఆదివారమే క్రిస్మస్ వచ్చింది. అంతా రెగ్యులర్ గా వండే వంటలు కాకుండా కొత్తగా తినాలనుకుంటారు. అయితే సండే కదా చికెన్ ఇంట్లో తప్పనిసరిగా వండే వంటకం. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ను ఇంటిళ్లపాదికి నచ్చేలా ప్లాన్ చేయాలనుకుంటున్నారా. అయితే చికెన్ టిక్కా రెసిపీ చేయండి. నిజమే వండే విధానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇంత టేస్టీ రెసిపీ ఇంట్లో వాళ్లకు పెడితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. సో టేస్టీ చికెన్ టిక్కా రెసిపీని ఇప్పుడు చూద్దాం.

చికెన్ టిక్కా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

  • బోన్లెస్ చికెన్ – 250 గ్రా 
  • చిక్కటి పెరుగు-50  
  • జీలకర్ర- 1tbsp
  • మంచునూనె -1tbsp
  • అల్లం ముక్కలు: 1 tbsp
  • వెల్లుల్లి ముక్కలు : 2 tbsp
  • తరిగిన పచ్చిమిర్చి: 1 tbsp
  • ఉల్లిపాయ ముక్కలు: 4-5 pcs
  • గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు: 4-5 pcs
  • ఉల్లిపాయ-టమోటో గ్రేవీ: సరిపడినంతా
  • గరం మసాలా పౌడర్: 2 టీ స్పూన్లు
  • ఉప్పు: రుచికి సరిపడా
  • వెన్న: 1 టేబుల్ స్పూన్
  • వంట క్రీమ్: 2 టీస్పూన్లు
  • తరిగిన కొత్తిమీర: గార్నిష్ కోసం

చికెన్ టిక్కా తయారు చేసే విధానం

1) మసాల దినుసులు, పెరుగు నూనెతో చికెన్‌ని బాగా కలపాలి. అనంతరం ఫ్రిజ్‌లో 3-4 గంటలు పెట్టి మేరినేట్ చేయాలి. అనంతరం చికెన్ ను ఓవెన్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2) కడాయిలో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయాలి.

ఇవి కూడా చదవండి

3) చిటపటలాడడం స్టార్ట్ అయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

4) ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ కూడా వేసి వేయించాలి.

5) ఓవెన్ లో ఉడికించిన చికెన్ టిక్కా వేసి వేయించాలి.

6) ఉల్లిపాయ-టమోటో గ్రేవీ వేసి బాగా కలపాలి. సిద్ధం చేసిన మసాలా పొడులు వేసి బాగా కలపాలి.

7) కొంచెం నీటిని వేసి, మంటను సిమ్ లో పెట్టి తక్కువ వేడి మీద కలపాలి.

8) మొత్తం జ్యూసిగా అయ్యాక వెన్న, వంట క్రీమ్‌ను వేసి కలియతిప్పాలి. 

9) అనంతరం గిన్నెలోకి తీసుకుని తాజా కొత్తిమీరతో అలంకరిస్తే..టేస్టీ..టేస్టీ చికెన్ టిక్కా రెడీ…

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా?ఇవి 99 శాతం మందికి తెలియదు
ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా?ఇవి 99 శాతం మందికి తెలియదు
అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన..
అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన..
ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు!
ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు!
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..