Trending News: హుండీ లెక్కింపులో అరుదైన దృశ్యం…ఆ సినిమా సీన్ రిపీట్ చేస్తూ ఉత్తరాలు.. ఏం రాశారో తెలుసా..?
ఈ ఆలయానికి సుప్రీం న్యాయమూర్తులుగా ఉన్న ఎస్.ఎ.బోబ్డే, ఎన్.వి. రమణ, రంజన్ గొగోయ్ సందర్శించి పూజలు చేయడం మరింత ప్రత్యేకం.
కోరికలు తీరాలని దేవుడికి పూజలు చేయటం, నైవేద్యం పెట్టడం చూశాం. హుండీలో కానుకలు వేయటం కూడా చూస్తుంటాం. అయితే, అలాంటి క్రమంలోనే కానుకలు వేసే హుండీలో అప్పుడప్పుడు కొన్ని వింత వస్తువులు, విచిత్ర లేఖలు ప్రత్యక్షమవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు కర్ణాటకలోని చామరాజనగర్‌లోని శ్రీ చామరాజేశ్వర దేవాలయం హుండీలో ఓ విచిత్ర లేఖ దొరికింది. అది కూడా ఒక అమ్మాయికి సంబంధించినది. హుండీ లెక్కింపు కొనసాగుతుండగా మరో లేఖ కూడా దొరికింది. అందులో దేవుని రాజ్యం దగ్గర్లో ఉందని రాసి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సుమారు ఏడాదిన్నర తర్వాత చామరాజేశ్వర ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. డిసెంబర్ 23 ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో స్వామివారి హుండీని లెక్కించారు. సుమారు రూ. 7 లక్షల రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్టుగా తెలిసింది.. హుండీ లెక్కింపు ప్రక్రియలో కొన్ని లేఖలు, ఆహ్వానాలు కూడా దొరికాయి. ఏసు క్రీస్తు జననం గురించి రాసాడు. అతను క్రీస్తును విశ్వసిస్తూ.. దేవుని రాజ్యం సమీపంలో ఉందంటూ లేఖ రాసి హుండీలో వేశాడు. మరో ఒక యువకుడు శివలింగ చిత్రాన్ని గీసి..తన ప్రేమ ఫలించాలని దేవుడిని ప్రార్థిస్తూ లేఖ రాసి హుండీలో వేశాడు. హుండీలో యువతి చిత్రపటం, ఆహ్వాన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.
మౌళిక వసతులు కల్పించేందుకు సూచనలు జిల్లాలోని హనూర్ తాలూకాలోని మలేమహదేశ్వర్ కొండకు వచ్చే భక్తులకు తగినన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చామరాజనగర్‌లో ఇటీవల సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి