Ashwani Vaishnav: అధికారులపై కేంద్ర మంత్రి కన్నెర్ర.. పది మందితో బలవంతపు రిటైర్మెంట్.. కారణం అదే..
టెలికామ్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశాలు జారీ చేశారు. పది మంది డీఓటీ అధికారులను తొలగిస్తూ . అయితే వారితో బలవంతపు రిటైర్మెంట్ చేయించారు. పనితీరులో అవినీతి పట్ల జీరో టాలరెన్స్‌ను కొనసాగిస్తున్నారన్న...

టెలికామ్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశాలు జారీ చేశారు. పది మంది డీఓటీ అధికారులను తొలగిస్తూ . అయితే వారితో బలవంతపు రిటైర్మెంట్ చేయించారు. పనితీరులో అవినీతి పట్ల జీరో టాలరెన్స్‌ను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలతో కేంద్ర మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో జాయింట్ సెక్రటరీతో సహా 10 మంది సీనియర్ డీఓటీ అధికారులు ఉన్నాయి. అయితే వారందరి ఫోర్స్ రిటైర్మెంట్‌ను ఆమోదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీసీఎస్ రూల్స్, 1972లోని పెన్షన్ రూల్ 48 ప్రకారం.. సెక్షన్ 56 (J) కింద టెలికాం శాఖలోని ఉద్యోగులకు బలవంతంగా పదవీ విరమణ చేయడం ఇదే మొదటిసారి. చిత్త శుద్ధి లేని, అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం సహించలేదని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. 10 మందిలో తొమ్మిది మంది అధికారులు డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఒకరు జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వ రంగ సంస్థకు రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించిన తర్వాత వైష్ణవ్ సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ లో ఓ బీఎస్ఎన్ఎల్ అధికారి నిద్రపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన సేవల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. రైల్వే పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉన్న వైష్ణవ్.. సెక్రటరీ స్థాయి అధికారి, ఇద్దరు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారుల పనితీరు కారణంగా రైల్వే శాఖలోని దాదాపు 40 మంది అధికారులకు బలవంతపు పదవీ విరమణ పొందారు.
మరోవైపు.. రైళ్లలో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వారికి ఇచ్చే రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..