AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి నీ ప్రేమ బంగారం కానూ.. ప్రపోజ్ చేసేందుకు ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కేశాడు.. కానీ..

సాధారణంగా సినిమలు క్లైమాక్స్ కు వచ్చే సరికి.. తనను ప్రేమించాలంటూ హీరో.. బిల్డింగో, వాటర్ ట్యాంకో ఎక్కడం మనం చూశాం. అప్పుడు హీరోయిన్ ప్రేమిస్తున్నానంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుభం కార్డు పడుతుంది....

Viral Video: ఓరి నీ ప్రేమ బంగారం కానూ.. ప్రపోజ్ చేసేందుకు ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కేశాడు.. కానీ..
Love Proposal
Ganesh Mudavath
|

Updated on: Dec 24, 2022 | 6:09 PM

Share

సాధారణంగా సినిమలు క్లైమాక్స్ కు వచ్చే సరికి.. తనను ప్రేమించాలంటూ హీరో.. బిల్డింగో, వాటర్ ట్యాంకో ఎక్కడం మనం చూశాం. అప్పుడు హీరోయిన్ ప్రేమిస్తున్నానంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుభం కార్డు పడుతుంది. ఇలాంటి సీన్ లు సినిమాలో బాగానే ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటివి కుదరవు. కానీ అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కచ్చితంగా నవ్వుతారు. ఈ వీడియోలో, వ్యక్తి వాటర్ ట్యాంక్‌పై లేనప్పటికీ, మరింత ప్రమాదకరమైనది. తన లవ్ ను ఒప్పుకోవాలని ఏకంగా కరెంట్ స్తంభం పైకి ఎక్కాడు. అంతే కాకుండా అక్కడ నిలబడి ప్రపోజ్ కూడా చేశాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి, పైన నిలబడి తన ప్రియురాలికి తన ప్రేమను బిగ్గరగా తెలియజేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అతను, ‘పూజా…ఐ లవ్ యూ పూజా…ఐ లవ్ యూ’ అని అరుస్తున్నాడు. ఇలా ప్రేమను వ్యక్తం చేయడం చాలా ప్రమాదకరమైనది. ఆ సమయంలో కరెంటు లేకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. లేకుంటే అతని పని అక్కడితే కతం అయిపోయేది. తమ ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులను మీరు ఎక్కువగా చూసి ఉంటారు. కానీ ఈ విధంగా ఎవరైనా రిస్క్ తీసుకుని ఎలక్ట్రిక్ పోల్‌పైకి ఎక్కి తన ప్రేమను చెప్పడం మాత్రం మీరు ఎక్కడా చూసి ఉండరు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ‘పూజా నామ్ థా ఉస్కా, జిందగీ కా హవన్ కర్వా కే చలీ గయీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 94 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..
ఏపీలో వారి అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి
ఏపీలో వారి అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి