ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైక్‌లు ఢీకొని నలుగురు దుర్మరణం.. ఒకే కుటుంబానికి చెందిన..
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ తాంసి మండలంలోని హాసనాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం.. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న దిచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కిన్వాట్ జిల్లా అందుబొరి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో తండ్రి మారుతి, 15 ఏళ్ల కూతురు మనీషా, 11ఏళ్ల కుమారుడు సంస్కార్ ఉన్నారు. తల్లి వందనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇచ్చోడ మండలం అశోక్‌నగర్‌కు చెందిన కుటుంబం తాంసి నుంచి ఆదిలాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయలైన ఇద్దరికీ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి ఎవరనేది వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..