Good Governance Day: గుడ్ గవర్నెన్స్ డేలో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థిని మౌనిక.. పార్లమెంట్‌లో అదరిపోయే స్పీచ్..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ సహా.. పలువురు నేతలు వాజ్‌పేయికి ఘనంగా నివాళులర్పించారు. అయితే, అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ హాల్లో గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమం జరిగింది.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ సహా.. పలువురు నేతలు వాజ్‌పేయికి ఘనంగా నివాళులర్పించారు. అయితే, అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ హాల్లో గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థిని సత్తాచాటింది. గుడ్ గవర్నెన్స్ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని కే. మౌనిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన యూత్ పార్లమెంట్‌లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన మౌనికకు.. యూత్ పార్లమెంట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మౌనిక మాజీ ప్రధాని వాజ్‌పేయి, పరిపాలన గురించి అద్భుతంగా ప్రసంగించి పలు రాష్ట్రాల నుంచి హాజరైన ప్రముఖుల నుంచి మన్ననలు పొందింది. ఆమె ప్రసంగం అనంతరం మౌనికను కరతాళ ధ్వనులతో అభినందించారు.
కామారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన కే. మౌనిక తండ్రి డీసీఎం డ్రైవర్‌గా, ఆమె తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో మౌనిక మొదటి అమ్మాయి. చిన్నప్పటినుండే సివిల్స్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో మౌనిక అన్నింటిలో ప్రతిభ కనబరుస్తూ చదువులో సత్తా చాటుతోంది. పార్లమెంట్లో గుడ్ గవర్నెన్స్, అటల్ బిహారీ వాజ్‌పేయి, పరిపాలను సంబంధించిన ముఖ్య విషయాలను పార్లమెంట్‌లో అనర్గళంగా మాట్లాడి.. మౌనిక అందరిని ఆకట్టుకుంది. పరిపాలన ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని.. అభివృద్ధికి నాంది కావాలంటూ సూచించింది. దానికనుగుణంగా మార్పులు కూడా అవసరమని మౌనిక వివరించింది.

Mounika
కాగా.. వాజ్‌పేయి జయంతి సందర్భంగా తెలంగాణ నుంచి.. పార్లమెంటులో ప్రసంగించే అవకాశం ఒక మౌనికకు మాత్రమే లభించడం గర్వకారణమని పలువురు ఆమెను అభినందించారు. మౌనిక కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని అదే కళాశాలలో పీజీ చదువుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటడం పట్ల పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మౌనికను అభినందించారు.




వీడియో చూడండి..
కాగా.. 2014లో అధికారాన్ని చేపట్టిన నాటినుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం డిసెంబర్ 25వ తేదీని గుడ్ గవర్నెన్స్ డే (సుపరిపాలన దినోత్సవం) గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ జవాబుదారీతనం, పరిపాలన గురించి పౌరులలో అవగాహన పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..